Movie News

భాగ్యశ్రీని అలా అనడం కరెక్టేనా?

సాధారణంగా సినిమాల ఫలితాల విషయంలో హీరోయిన్ల వాటా తక్కువ అన్నది వాస్తవం. మన సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం తక్కువగానే ఉంటుంది. ఎక్కువగా వాళ్లు గ్లామర్ డాల్స్‌గానే కనిపిస్తుంటారు. తమ పాత్రలకు ప్రాధాన్యం ఉన్నపుడు వాటికి తమ నటనతో న్యాయం చేయడం.. అలాగే పాటల్లో అందచందాలతో సినిమాకు ఆకర్షణ తీసుకురావడం.. ప్రమోషన్ పరంగా వీలైనంత సాయం చేయడం.. ఇలా ఉంటుంది హీరోయిన్ల వ్యవహారం. 

సినిమాలు సక్సెస్ కావడంలో హీరోయిన్లకు వారి పరిధిని అనుసరించి క్రెడిట్ ఇవ్వాలి కానీ.. ఫెయిల్యూర్ క్రెడిట్ వారి ఖాతాలో వేయడం మాత్రం అన్యాయమనే చెప్పాలి. హీరోయిన్ల వల్ల సినిమాలు చెడిపోయే సందర్భాలు అరుదుగా ఉంటాయి. కానీ ఒక హీరోయిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే.. తన మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసేయడం సోషల్ మీడియాలో కామన్ ప్రాక్టీస్ అయిపోయింది.

గతంలో శ్రుతి హాసన్ కెరీర్ ఆరంభంలో నటించిన చిత్రాలు కొన్ని ఫెయిలయ్యాయని ఆమెను ఐరెన్ లెగ్ అనేశారు. కానీ తర్వాత ఆమె వరుస సక్సెస్‌లతో ఎలా దూసుకెళ్తిందో, ఎంత పెద్ద హీరోయిన్ అయిందో తెలిసిందే. వర్తమానంలో భాగ్యశ్రీ బోర్సే మీద కొందరు నెగెటివ్ ముద్ర వేయాలని చూస్తున్నారు. వరుసగా నాలుగు ఫ్లాపులిచ్చింది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

గత ఏడాది తెలుగులో తన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్ అయింది. కానీ విడుదలకు ముందే ప్రోమోల్లో అందచందాలతో కుర్రాళ్ల దృష్టిని బాగా ఆకర్షించింది భాగ్యశ్రీ. ఆమె పేరు ఇండస్ట్రీలో మార్మోగడంతో అవకాశాలు వరుస కట్టాయి. కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా, లెనిన్.. ఇలా వరుసగా బోలెడు ఛాన్సులు వచ్చాయి. కానీ వీటిలో ఇంకో మూడు సినిమాలు రిలీజయ్యాయి. అవేవీ ఆశాజనకమైన ఫలితాలు అందుకోలేదు. 

ఐతే మిస్టర్ బచ్చన్, కింగ్డమ్ సినిమాలను పక్కన పెడితే.. కాంత, ఆంధ్ర కింగ్ తాలూకాలో భాగ్యశ్రీ అన్ని విధాలా మెప్పించింది. తన అందంతో ఆకట్టుకోవడమే కాదు.. నటనతోనూ మెప్పించింది. ఆమెను జస్ట్ గ్లామర్ డాల్ అనడానికి లేదు. తన ప్రతి సినిమా ప్రమోషన్ కోసం ఆమె ఎంతో కష్టపడిందన్నది వాస్తవం. ముఖ్యంగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యుఎస్‌కు వెళ్లి మరీ ప్రమోట్ చేసింది.

ఇంత డెడికేషన్ హీరోయిన్లలో అరుదుగా కనిపిస్తుంటుంది. అందం, అభినయం రెండూ ఉన్నాయి. తన పాత్రలకు న్యాయం చేస్తోంది. ప్రమోషన్ల పరంగానూ కష్టపడుతోంది. ఇలాంటి హీరోయిన్ల మీద ఐరెన్ లెగ్ ముద్ర వేసి నెగెటివ్ ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని సోషల్ మీడియా జనాలు గుర్తిస్తే మంచిది.

This post was last modified on December 4, 2025 9:15 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

2 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

3 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

5 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

6 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

6 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

8 hours ago