ఆర్ఆర్ఆర్ నుంచి మన తెలుగు సినిమాలు జపాన్ లోనూ ఆడతాయనే నమ్మకం టాలీవుడ్ నిర్మాతలకు వచ్చింది. అలాని అన్నీ ఒకే ఫలితాన్ని ఇవ్వడం లేదు. దేవరని పెద్ద ఎత్తున విడుదల చేస్తే అంతంత మాత్రంగానే ఆడింది. కల్కి 2898 ఏడిది సైతం ఇదే పరిస్థితి. అయితే అల్లు అర్జున్ తగ్గేదేలే అంటున్నాడు. వచ్చే ఏడాది జనవరి 16 పుష్ప 2 ది రూల్ జపాన్ దేశంలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చింది. దీని కోసం ఏర్పాట్లు జరిగిపోయాయట. వరల్డ్ వైడ్ ఇప్పటిదాకా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసిన ఈ బ్లాక్ బస్టర్ అక్కడా అదే రిజల్ట్ అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
ప్రస్తుతం అట్లీతో షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఇప్పుడీ పుష్ప 2 జపాన్ రిలీజ్ కోసం ప్రమోషన్లకు ఎంత సమయం కేటాయిస్తాడనేది చూడాలి. గతంలో పుష్ప 1 ది రైజ్ రష్యాలో రిలీజ్ చేసినప్పుడు బన్నీ, రష్మిక మందన్నతో పాటు నిర్మాతలూ వెళ్లి పబ్లిసిటీలో భాగమయ్యారు. దాని వల్ల పెద్దగా రిజల్ట్ రాలేదు కానీ పుష్ప 2కి వచ్చిన గ్లోబల్ రీచ్ దృష్టిలో పెట్టుకుని జపాన్ లో ప్లాన్ చేస్తున్నారు. అదేంటి అక్కడ ఉన్న వాళ్ళయినా డిజిటల్ లో దీన్ని చూసి ఉంటారని అనుకోవడానికి లేదు. జపాన్ లో పైరసీ సైట్లు పని చేయవు. నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటిలు ఆ దేశం నియమనిబంధనలకు లోబడి కంటెంట్ పెడతాయి.
సో పుష్ప 2 చూడని వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాకపోతే ఎమోషన్స్ ఎక్కువగా ఉన్న విదేశీ సినిమాలకు పెద్ద పీఠ వేసే జపాన్ వాళ్ళు పుష్ప 2ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. ఎలాగూ దర్శకుడు సుకుమార్ ఆ దేశం రెఫరెన్సులను కథలో కీలక భాగం చేశారు కాబట్టి ఆ కోణంలో కనెక్ట్ అవుతుందని అనుకున్నారేమో. ఒకవేళ పుష్ప 2 అక్కడ సక్సెస్ అయితే అల్లు అర్జున్ ఇమేజ్ మరింత విస్తరిస్తుంది .ట్విస్ట్ ఏంటంటే పుష్ప 1 జపాన్ లో థియేటర్ రిలీజ్ కాలేదు. 2023 ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించి ఆ తర్వాత బ్లూ రే డిస్క్ విడుదల చేశారు. కానీ పుష్ప 2 దానికి భిన్నంగా పెద్ద తెరపై పలకరించనుంది.
This post was last modified on December 3, 2025 3:13 pm
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…