తెలుగు సోషల్ మీడియాకు నిన్నట్నుంచి ప్రధాన వార్త.. సమంత పెళ్లి వ్యవహారమే. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడం.. కొన్నేళ్లకే అతడితో విభేదాలు వచ్చి విడాకులు తీసుకోవడం.. తర్వాత అనారోగ్యం పాలవడం.. అదే సమయంలో నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లాడడం.. రాజ్ నిడిమోరుతో సమంత ప్రేమలో పడడం.. చివరికి అతణ్ని పెళ్లి చేసుకోవడం.. ఇలా వివిధ సందర్భాల్లో సామ్ గురించి సోషల్ మీడియా విస్తృతంగా చర్చిస్తూనే ఉంది.
కాగా ఇప్పుడు సమంత పెళ్లితో అన్ని వివాదాలకు తెరపడినట్లే.. ఇక ఎవరి జీవితం వారిది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ అదే సమయంలో సమంత మీద సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందిస్తోంది ఒక వర్గం. ఆమె గురించి పెద్ద ఎత్తున నెగెటివ్ పోస్టులు పడుతుండడం గమనార్హం. నాగచైతన్య, సమంత విడిపోయినపుడు.. శోభితను చైతూ పెళ్లి చేసుకున్నపుడు.. అక్కినేని హీరో మీద సోషల్ మీడియాలో ఒక వర్గం విరుచుకుపడింది. చైతూ సమంతను మోసం చేశాడన్నట్లు.. ఈ వ్యవహారంలో సమంత బాధితురాలన్నట్లు అతడి మీద నిందలు వేశారు.
విడాకుల విషయమై సమంత బాధ పడుతుంటే.. అనారోగ్యంతో సతమతం అవుతుంటే.. చైతూ హాయిగా పెళ్లి చేసుకున్నాడంటూ అతడిపై మండిపడ్డారు. శోభితను పెళ్లి చేసుకోవడం కోసమే సమంత నుంచి విడిపోయాడని కూడా అతడిని నిందించారు. విడాకుల తర్వాత చైతూ ఎంతో హుందాగా వ్యవహరించినా.. కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో పద్ధతిగా వివరించినా ఆ వర్గం అతణ్ని టార్గెట్ చేయడం ఆపలేదు.
ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల విడాకుల ప్రభావం తన మీద ఎలా పడిందో వివరిస్తూ.. విడాకుల నిర్ణయం ఒకటికి వందసార్లు ఆలోచించి తీసుకున్నదని చెప్పినా వాళ్లు అతడిపై విమర్శలు, ఆరోపణల్ని ఆపలేదు. ఐతే ఇప్పుడు సమంత పెళ్లి వెనుక ఏం జరిగిందో విశ్లేషిస్తూ.. చైతూ నుంచి విడాకులు తీసుకోవడానికి ముందే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ సిరీస్ చేసి రాజ్‌తో సమంతకు పరిచయం ఏర్పడ్డ విషయాన్ని గుర్తు చేస్తూ ఎవరు ఎవరిని మోసం చేశారని ప్రశ్నిస్తున్నారు చైతూ మద్దతుదారులు. అప్పుడు చైతూ మీద అనేక నిందలు వేసి, అతణ్ని అదేపనిగా టార్గెట్ చేసిన వాళ్లంతా ఇప్పుడు అతడికి సారీ చెప్పాలని ఈ వర్గం డిమాండ్ చేస్తోంది.
This post was last modified on December 2, 2025 8:54 pm
దేశంలో పురాతన, బ్రిటీష్ కాలం నాటి పేర్లను, ఊర్లను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం…
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…
అనుకున్నట్టే అఖండ 2 తాండవం టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ముందు రోజు…
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు గట్టి నమ్మకం ఏర్పడుతోందని ఆయన కుమారులు సులేమాన్,…
కోనసీమ ప్రాంతం వల్లే ఉమ్మడి ఏపీ విడిపోయిందేమోనంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ…
కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి దిష్టి తగలడం, తెలంగాణ నాయకుల పదే పదే ఇక్కడి పచ్చదనం గురించి మాట్లాడడమే కారణమని,…