టాలీవుడ్లో మరో ప్రముఖ పెళ్లికి రంగం సిద్ధమైంది. మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారిక ఈ నెల 9న చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు హైదరాబాద్ నుంచి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు బయల్దేరాయి. అక్కడ ఉదయ్ విలాస్ అనే లగ్జరీ హోటల్లో నిహారిక, చైతన్యల పెళ్లి జరగబోతోంది.
ఉదయ్ పూర్‌కు బయల్దేరడానికి ముందు నిహారికను హైదరాబాద్‌లోని తన ఇంట్లో పెళ్లి కూతురిని చేశారు. సంప్రదాయబద్ధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకకు చిరు కుటుంబం కూడా హాజరైంది. ఆ వేడుక ముగించుకుని పెళ్లి కోసం చార్టెడ్ ఫ్లైట్లో వధువు, వరుడు, ఇరు కుటుంబాల ముఖ్య సభ్యులు ఉదయ్ పూర్‌కు బయల్దేరారు. ఉదయ్ పూర్‌కు చేరుకోగానే పెళ్లి తంతులో భాగం కాబోతున్న నాగబాబు.. దానికి ముందు ట్విట్టర్లో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు.
‘‘ఒక కుటుంబంగా మేం నీకు మూలాలు ఇచ్చాం. ఒక తండ్రిగా నీకు నేను రెక్కలు ఇచ్చా. ఆ రెక్కలు నిన్ను ఎంతో ఎత్తుకు ఎగిరే అవకాశాన్నిస్తాయి. ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ భద్రంగా ఉంచుతాయి. నీ ప్రియమైన తండ్రి నీకిచ్చిన ఉత్తమమైన బహుమతులు ఇవి’’ అని పేర్కొంటూ.. నిహారికను పెళ్లి కూతురిని చేసిన వేడుకలో ఆమెతో కలిసి తాను, తన భార్య, చిరంజీవి, సురేఖ కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు నాగబాబు.
కూతురిపై నాగబాబు ప్రేమ ఎలాంటిదో అనేక సందర్భాల్లో చూశాం. ఆ ముద్దుల కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తున్నపుడు ఎంత ఉద్వేగం ఉంటుందో అర్థం చేసుకోగలం. ఆ ఉద్వేగాన్నే ట్విట్టర్లో చూపించారు నాగబాబు. ఇక పెళ్లి కోసం అతిథులందరూ కూడా ఈ రోజే ఉదయ్ పూర్‌కు చేరుకోనున్నారు. రెండు రోజుల పాటు వేడుకలు సాగుతాయి. అందరికీ కోవిడ్ పరీక్షలు చేశాకే పెళ్లికి అనుమతించబోతున్నారు.
This post was last modified on December 7, 2020 12:15 pm
కొన్ని వెబ్ సిరీస్ లకు సినిమాల రేంజ్ హైప్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి ఉదాహరణలు.…
సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ సక్సెస్ దగ్గుబాటి అభిమానులకు ఇస్తున్న కిక్ అంతా ఇంతా కాదు. నలభై యాభై కాదు…
ఇటీవలే తన స్వంత అపార్ట్ మెంట్ లో దాడికి గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కేసు రోజుకో…
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయడంతో మొదట వలసదారుల్లో టెన్షన్ నెలకొంది. మొట్ట మొదట ట్రంప్ ‘అమెరికా…
పట్టుబట్టారు.. సాధించారు. ఈ మాటకు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, మంత్రి నారాయణ సహా.. నారా లోకే ష్ కూడా…
అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ సంచలనాత్మక నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, లింగ…