మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ‘మగధీర’తో కెరీర్‌లో రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్, ‘రంగస్థలం’ సినిమాతో నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే చరణ్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ కాకుండా మెగాస్టార్ డైరెక్టర్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ అతిథి పాత్రలో నటిస్తున్నాడు. గెస్ట్ రోల్ అయినా సినిమాకి చెర్రీ పాత్ర కీలకం కానుందట. అయితే మెగా ఫ్యాన్స్ నిరుత్సాహపడకుండా చరణ్ కోసం రెండు స్పెషల్ సాంగ్స్ ఈ సినిమాలో ఇరికిస్తున్నాడట కొరటాల శివ.
చరణ్ డ్యాన్స్ చూద్దామని థియేటర్‌కి వచ్చే మెగాఫ్యాన్స్ కోసం ఊరమాస్ స్టెప్పులతో సాగే ఓ స్పెషల్ సాంగ్‌తో పాటు ఓ ఎమోషనల్ సాంగ్ కూడా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నట్లు టాక్. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో నిహారిక కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తుందంటూ వార్తలు వచ్చాయి. మరి చరణ్ ప్రక్కన హీరోయిన్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం వేచి చూడాల్సిన విషయమే.
లాక్‌డౌన్ కారణంగా గ్యాప్ తీసుకున్న ‘ఆచార్య’ చిత్ర యూనిట్, లాక్‌డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ మొదలెట్టి షరవేగంగా పూర్తిచేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ముందుగా దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నా, నెలకు పైగా బ్రేక్ రావడంతో సంక్రాంతి బరిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
This post was last modified on May 2, 2020 7:17 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…