Movie News

అఖండ 2 అదిరిపోయే బోణీ చేయాలి

డిసెంబర్ నెల వచ్చేసింది. ఏడాదిలో చివరి మంత్ కావడంతో బాక్సాఫీస్ పరంగా ఎలాంటి ఘనమైన బ్లాక్ బస్టర్లు, వీడ్కోలు దక్కుతాయోనని ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. నవంబర్ లో గర్ల్ ఫ్రెండ్, రాజు వెడ్స్ రాంబాయి, ఆంధ్రకింగ్ తాలూకా లాంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ఉన్నాయి కానీ వారాల తరబడి ఉమ్మడి రాష్ట్రాల థియేటర్లను హౌస్ ఫుల్ చేసినవి లేవు. ఒకచోట వసూళ్లు బాగుంటే మరోచోట డల్లుగా కనిపిస్తాయి. కొన్ని ఏరియాలు లాభాలు చూస్తే మరికొన్ని బ్రేక్ ఈవెన్ కష్టమనేలా ఉంటాయి. మళ్ళీ పుష్ప 2, ఓజి, కాంతార 1 రేంజ్ బొమ్మ కోసం ట్రేడ్ ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. దానికి శ్రీకారం చుట్టే బాధ్యత అఖండ 2 తాండవం మీదే ఉంది.

కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్లు వేస్తున్నారు. ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ఇవి ఉంటాయని నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఇవి పరిమితంగా వేస్తారనే టెన్షన్ అభిమానులకు అక్కర్లేదు. డిసెంబర్ 4 రాత్రి థియేటర్ల దగ్గర ఓ రేంజ్ లో హడావిడి ఉంటుంది. అర్ధరాత్రి వచ్చే టాక్ కోసం మూవీ లవర్స్ మాత్రమే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తాయి. పాజిటివ్ వస్తే చాలు వసూళ్ల విధ్వంసం మొదలైపోతుంది. ఎందుకంటే ఓజి తర్వాత టాలీవుడ్ కు మాస్ బొమ్మ పడలేదు. డిజాస్టర్ టాక్ వచ్చినా సరే మాస్ జాతర రెండు వారాలు స్టాండ్ అయ్యిందంటే కారణం ఆ వర్గం ఆడియన్స్ కరువే.

దర్శకుడు బోయపాటి శీను కాన్ఫిడెన్స్ చూస్తుంటే డబుల్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టినట్టే ఉంది. కేవలం ఒక డ్యూయెట్ మాత్రమే పెట్టి మిగిలినవన్నీ ఆధ్యాత్మిక గీతాలు కంపోజ్ చేసిన తమన్ ఈసారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ ని రెట్టింపు మెప్పించాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా ఇంత క్రేజ్ ఉన్న సీక్వెల్ కి కనిపించాల్సిన హైప్ పూర్తి స్థాయిలో లేదని కొందరు ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ, మొదటి షో కాగానే సినిమా బాగుందనే మాట వినిపిస్తే చాలు వాళ్ళ అనుమానం దూదిపింజెల్లా ఎగిరిపోతుంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన అఖండ 2లో విలన్ అఘోరాలో ఆది పినిశెట్టి కొత్తగా కనిపించబోతున్నాడు.

This post was last modified on December 1, 2025 10:50 am

Share

Recent Posts

నానీనే స‌వాల్ చేస్తున్న చిన్న హీరో

సంక్రాంతి, ద‌స‌రా లాంటి పెద్ద పండుగ‌ల‌ను ప‌క్క‌న పెడితే.. ఒక పెద్ద సినిమా రిలీజ‌వుతున్న‌పుడు చిన్న సినిమాలు పోటీలో ఉండ‌డం…

22 minutes ago

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

42 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

3 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

3 hours ago