‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ… ఆ తర్వాత ‘గుణ 369’, ‘90ఎమ్ఎల్’, ‘హిప్పీ’ వంటి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో క్రేజ్ సంపాదించాడు. అయితే నాని హీరోగా రూపొందిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో విలన్‌గా కనిపించి, నెగిటివ్ రోల్‌లోనూ మెప్పించాడు కార్తీ.
దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించిన ‘గ్యాంగ్ లీడర్’లో మనోడి యాక్టింగ్ స్కిల్స్‌కు ఇంప్రెస్ అయిన తమిళ డైరెక్టర్ హెచ్. వినోద్, కోలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విలన్ రోల్ ఆఫర్ చేశాడని టాక్ వినిపిస్తోంది.
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా రూపొందుతున్న ‘వలిమయ్’ చిత్రంలో కార్తికేయ పవర్ ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మే1న ‘తలా’ అజిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు వీరాభిమాని అయిన కార్తీకేయ ‘వలిమయ్’ పోస్టర్ పోస్ట్ చేసి బర్త్‌డే విషెస్ తెలిపాడు. దీంతో ఈ సినిమాలో విలన్ కార్తికేయనే అంటూ రూమర్లు వచ్చాయని, ఇందులో ఏ మాత్రం నిజం లేదంటున్నారు టాలీవుడ్ జనాలు.
‘గ్యాంగ్ లీడర్’ సినిమా తన కెరీర్‌కు పెద్దగా హెల్ప్ కాకపోవడంతో కార్తికేయ ఇకపై విలన్ వేషాలు వేయకూడదని ఫిక్స్ అయ్యాడట. ప్రస్తుతం గీతాఆర్ట్స్ బ్యానర్‌లో ‘చావుకబురు చల్లగా’ మూవీ చేస్తున్న కార్తికేయ, విలన్ వేషాల గురించి వస్తున్న వార్తలను చూసి భయపడుతున్నాడట. అది సంగతి.
This post was last modified on May 2, 2020 7:15 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. నోబెల్ ప్రపంచ శాంతి పురస్కారం కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన విషయం తెలిసిందే.…