పూనమ్ కౌర్.. ఈ పేరు టాలీవుడ్ వర్గాల్లో ఎప్పుడూ చర్చనీయాంశమే. ఐతే ఆమె వార్తల్లో నిలిచేది సినిమాకు సంబంధించిన అంశాలతో కాకపోవడమే ట్విస్టు. పంజాబీ అమ్మాయి అయిన పూనమ్ దశాబ్దం కిందట్నుంచి హైదరాబాద్‌లోనే ఉంటోంది. ఆమె చేసిన సినిమాలన్నీ చిన్నా చితకవే. వాటిలో కూడా కాస్తో కూస్తో ఆడినవి తక్కువే. కొన్నేళ్ల నుంచి పూనమ్ సినిమాల్లో కనిపించడం కూడా తగ్గిపోయింది. అయినా సరే.. సినిమాయేతర విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటుంది.
పవన్ కళ్యాణ్‌తో ముడిపెట్టి ఆమె గురించి చర్చ పెడుతుంటారు జనాలు. ఆమె కూడా ఈ విషయంలో జనాలకున్న సందేహాలను మరింత పెంచేలా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటుంది. కొన్నిసార్లు ఆమె పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా కామెంట్లు చేస్తుంటుంది. కొన్నిసార్లేమో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటుంది. కౌంటర్లు వేస్తుంటుంది.
తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌తో ముడిపడ్డ ఓ అంశంపై ఆమె మాట్లాడింది. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల గురించి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు ఆ వ్యాఖ్యల గురించి పెద్ద చర్చే నడిచింది. ఆయనపై పవన్ ఫ్యాన్స్, జనసేన మద్దతుదారులు విరుచుకుపడ్డారు. కాగా ప్రకాష్ రాజ్ తాజాగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులకు తన మద్దతు ప్రకటించారు. రైతుల బాధల గురించి మాట్లాడారు.
దీనిపై పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక నటుడు, రాజకీయ నాయకుడు అయిన వ్యక్తి గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడితే పెద్ద చర్చనీయాంశం అయ్యాయని, అవి పతాక శీర్షికలకు ఎక్కాయని కానీ ఏ పక్షపాతం లేకుండా, రాజకీయ అజెండా లేకుండా రైతుల గురించి మాట్లాడితే ఎవరూ పట్టించుకోవట్లేదని.. ఇది హిపోక్రసీ కాదా అని ప్రశ్నించింది పూనమ్. దీనికి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. వాళ్లు తమ అజెండా ప్రకారం అంతా చేస్తున్నారు అని ట్వీట్ చేశాడు. తర్వాత పూనమ్ స్పందిస్తూ.. రాజకీయ అజెండాకు తాను కూడా బాధితురాలినే అని వ్యాఖ్యానించింది. పవన్ పేరెత్తకుండా ఆయనకు సంబంధించిన విషయంలో పూనమ్ వ్యాఖ్యలు చేయడం మరోసారి చర్చనీయాంశం అవుతోంది.
This post was last modified on December 6, 2020 3:25 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…