పాజిటివ్ టాక్, రివ్యూలతో సూపర్ హిట్ దిశగా వెళ్తున్న ఆంధ్రకింగ్ తాలూకాకు సంబంధించిన ఓపెనింగ్ ఫిగర్స్ నిర్మాణ సంస్థ నుంచి బయటికి రావడం లేదు కానీ గత రెండు రోజులు మంచి ఆక్యుపెన్సీలే నమోదవుతున్నాయి. అయితే మాములుగా ఈ స్థాయి టాక్ తెచ్చుకున్న సినిమాల కలెక్షన్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. వీకెండ్ టికెట్లకు డిమాండ్ ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ రామ్ మూవీకి ఆ హడావిడి లేదు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లోనూ వసూళ్లు క్రమంగా మెరుగుపడుతున్నాయి తప్పించి అదిరిపోయాయనే స్థాయిలో దూసుకుపోవడం లేదు. ఈ నేపథ్యంలో శని ఆదివారాలు కీలకం కానున్నాయి.
ప్రస్తుతానికి ఆంధ్రకింగ్ తాలూకా స్పీడ్ చూస్తుంటే నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉంది. ఈ కిక్ అభిమానులకు సరిపోవడం లేదు. వరసగా నాలుగు ఫ్లాపుల తర్వాత వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ కావడంతో ఇది పెద్ద రేంజ్ కు వెళ్లాలని కోరుకుంటున్నారు. డిసెంబర్ 4 రాత్రి నుంచి అఖండ 2 తాండవం హడావిడి మొదలైపోతుంది. ఆలోగా రికవరీ పూర్తి చేసి లాభాల్లోకి వెళ్ళిపోవాలి. ఒకవేళ అఖండ 2కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఆ మేనియా ఇతర సినిమాల మీద ప్రభావం చూపిస్తుంది. రామ్, భాగ్యశ్రీ బోర్సేలు సరిగ్గా రిలీజ్ టైములో అమెరికా వెళ్లడం ప్రమోషన్స్ పరంగా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యిందని నిర్మాతే చెప్పడం ఒప్పుకోవాల్సిన వాస్తవం.
థియేటర్ బిజినెస్ రీజనబుల్ గా చేయడం వల్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ముప్పై కోట్ల లోపే ఉందని ట్రేడ్ టాక్. ఆదివారంలోపు దీంట్లో సగానికి పైగా వచ్చేస్తే టెన్షన్ ఉండదు. కంటెంట్ ని బాగా ప్రెజెంట్ చేసిన మహేష్ బాబు కొన్ని విషయాల్లో పడిన తడబాటు వల్ల యునానిమస్ అనిపించుకోలేదు. అయినా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాక్సాఫీస్ దగ్గర ఇదే ఫస్ట్ ఛాయస్ గా నిలుస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో మంచి ఆదరణ కనిపిస్తోంది. సింగల్ స్క్రీన్లలో కూడా పికప్ బాగుంది. రామ్ హైదరాబాద్ తిరిగి రాగానే ఒక ఈవెంట్ తో పాటు సక్సెస్ టూర్ వెళ్లే ప్రతిపాదన ఉందట. చూడాలి మరి ఏం చేస్తారో.
This post was last modified on November 29, 2025 11:20 am
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…