Movie News

ఉపేంద్రపై డౌట్లు తొలగిపోయాయి

రామ్ పోతినేని కొత్త సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఒక స్టార్ హీరోను ఆరాధించే వీరాభిమాని కథ. ఇందులో ఆంధ్రా కింగ్ అనే స్టార్ హీరో పాత్రను కన్నడ నటుడు ఉపేంద్ర పోషించాడు. తన అభిమానిగా రామ్ కనిపించాడు. ఐతే ఇక్కడ ఎంతోమంది సీనియర్ స్టార్లు ఉండగా.. కన్నడ నుంచి ఉపేంద్రను తీసుకొచ్చి ఈ పాత్రలో నటింపజేయడం ఏంటి అనే చర్చ జరిగింది. ఉపేంద్రను ఈ పాత్ర కోసం ఎంచుకుని అనౌన్స్‌‌మెంట్ ఇచ్చినపుడు ఈ ఎంపిక కరెక్టేనా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ నిన్న సినిమా చూశాక మాత్రం అందరూ ఉపేంద్రనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో ఉపేంద్ర పాత్ర నిడివి మరీ ఎక్కువ ఏమీ ఉండదు. 20-25 నిమిషాలకు మించి కనిపించడు ఉప్పి దాదా. ఇలాంటి పాత్రలో టాలీవుడ్ స్టార్లు ఎవరైనా చేసి ఉంటే.. వాళ్ల పాత్రకు ప్రాధాన్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. పైగా ఇందులో ఆ హీరో పాత్రకు ఎక్కువ ఎలివేషన్ ఉండదు. క్లైమాక్స్‌లో ఆ స్టార్ హీరోనే అభిమాని పాత్రకు ఎలివేషన్ ఇస్తాడు. ఇలాంటి పాత్రను టాలీవుడ్ స్టార్ ఎవరైనా చేసి ఉంటే.. అభిమానులు కొంత ఫీలయ్యేవాళ్లేమో. అదే సమయంలో ఒక స్టార్ హీరో ఈ పాత్ర చేస్తే.. వేరే హీరోల అభిమానులు ఈ చిత్రానికి సపోర్ట్ ఇచ్చేవారా అన్నది సందేహమే. 

కానీ ఇప్పుడు ఉపేంద్ర విషయంలో మన ప్రేక్షకులందరూ ఒకే రకంగా స్పందిస్తున్నారు. లెక్కలు వేసుకోకుండా ఆ పాత్రను పాజిటివ్ కోణంలో చూస్తున్నారు. ఉపేంద్రకు వ్యక్తిగతంగా ఉన్న హంబుల్ ఇమేజ్ ఈ పాత్రకు బాగా ఉపయోగపడింది. ఇమేజ్ గురించి పట్టించుకోకుండా సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చిన ఉపేంద్ర ఈ పాత్రను చాలా బాగా పండించాడు. కన్నడ ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో కానీ.. తెలుగు ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ పాత్రకు మంచి స్పందన వస్తోంది. ఉపేంద్రనే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

This post was last modified on November 29, 2025 8:31 am

Share

Recent Posts

వంద కోట్ల బోణీ సులభంగా కనపడుతోంది

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…

7 minutes ago

పాలు అమ్మాను… అనే పెద్దాయన చిన్న సినిమాకు పర్మిషన్ ఇవ్వలేదు

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…

53 minutes ago

3,400 లిప్‌స్టిక్‌ ముద్దులు… చివరికి రూ.5,500 జరిమానా!

ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…

1 hour ago

నాకు యాక్టింగ్ నేర్పిస్తావా… ఇరుముడి పాపతో ధనుష్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…

2 hours ago

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

2 hours ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

5 hours ago