టెనెట్.. టెనెట్.. టెనెట్.. ఇప్పుడు భారతీయ సినీ ప్రియుల నోళ్లలో నానుతున్న సినిమా ఇది. కరోనా కారణంగా ఏడెనిమిది నెలల పాటు మూత పడి ఈ మధ్యే తెరుచుకున్న ఇండియన్ థియేటర్లను బతికిస్తున్నది ఈ సినిమానే. అక్టోబరు మధ్య నుంచే థియేటర్లు పున:ప్రారంభించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ అప్పుడు కొద్ది సంఖ్యలోనే థియేటర్లను తెరిచారు. గత నెల రోజుల వ్యవధిలో పలు రాష్ట్రాల్లో మల్టీప్లెక్సులు పున:ప్రారంభం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యే థియేటర్లు తెరిచారు.
ఐతే ముందు తెరుచుకున్న థియేటర్లలో ఏవోవో సినిమాలు వేసి ఆడించారు కానీ.. వాటికి కనీస స్పందన లేకపోయింది. దీంతో థియేటర్లు తెరుచుకున్నాయంటే తెరుచుకున్నాయి అన్నట్లయింది పరిస్థితి. కొత్త సినిమా, అందులోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా లేకపోవడమే ఇందుక్కారణం.
ఐతే ‘టెనెట్’ లాంటి భారీ హాలీవుడ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసరికి ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ చిత్రం ఈ నెల 4న ఇంగ్లిష్‌తో పాటు ప్రాంతీయ భాషల్లోనూ విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లిష్, హిందీ, తెలుగు వెర్షన్లు నడుస్తున్నాయి. అన్ని వెర్షన్లకూ స్పందన బాగానే ఉంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను నడిపిస్తుండగా.. హైదరాబాద్‌లో మెజారిటీ మల్టీప్లెక్సుల్లో వీకెండ్ షోలు ఫుల్ అయ్యాయి. వీక్ డేస్‌లో కూడా బుకింగ్స్ బాగుంటాయనే అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరవడమైతే తెరిచారు కూడా అంతకుముందు నుంచి థియేటర్లు నడుస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితులు చూసి జనాల నుంచి ఏమాత్రం స్పందన ఉంటుందో అని సందేహించారు. కానీ ‘టెనెట్’ ఆడుతున్న థియేటర్లలో అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ‘టెనెట్’ను కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలోనే ధైర్యం చేసి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. సినిమాకు మంచి రివ్యూలొచ్చినా.. కరోనా ప్రభావం వల్ల వసూళ్లు ఆశాజనకంగా లేవు. ఐతే ఎట్టకేలకు ఇండియాలో రిలీజైన ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అందరికీ సంతోషం కలిగిస్తోంది.
This post was last modified on December 6, 2020 12:51 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…