ఒకప్పుడు శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్‌బస్టర్లు అందించిన నిర్మాత ఎం.ఎస్.రాజు. నిర్మాత ఆయన స్థాయి పడిపోతున్న సమయంలోనే దర్శకుడిగా మారి.. వాన, తూనీగ తూనీగ లాంటి సినిమాలు తీశారు. కానీ అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. ఈలోపు నిర్మాతగా ఆయన పరిస్థితి తల్లికిందులైంది. అడ్రస్ లేకుండా పోయారు రాజు.
ఐతే చాలా కాలం తర్వాత ఆయన మళ్లీ మెగా ఫోన్ పట్టారు. ‘డర్టీ హరి’ అనే అడల్ట్ మూవీ తీశాడు. శ్రావణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఇది. ఎప్పట్నుంచో రిలీజ్ గురించి కుర్రాళ్లను ఊరిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 18న విడుదల కాబోతోంది. ఐతే థియేటర్లు పున:ప్రారంభం అయిన నేపథ్యంలో వాటిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారా.. ఓటీటీ రిలీజ్‌కు వెళ్తారా అన్న సందేహం జనాల్లో ఉంది.
ఐతే రాజు గారు కొత్త రూటు ఎంచుకున్నారు. తన సినిమాను థియేటర్లలోనూ రిలీజ్ చేయట్లేదు. ఓటీటీ రిలీజ్‌కూ వెళ్లలేదు. పే పర్ వ్యూ పద్ధతిన ‘ఏటీటీ’లో రిలీజ్ చేయబోతున్నారు. వరల్డ్స్ ఫస్ట్ ఏటీటీగా వార్తల్లో నిలిచిన శ్రేయాస్ఈటీ సంస్థ.. కొత్తగా ఫ్రైడే మూవీస్ పేరుతో యాప్ తీసుకొస్తోంది. ఇకపై ఇందులోనే పే పవర్ వ్యూ పద్ధతిలో కొత్త సినిమాలు విడుదల చేయబోతోంది. అందులోనే ‘డర్టీ హరి’ విడుదల కాబోతోంది. ఇంకా టికెట్ రేటు ఎంత అన్నది నిర్ణయించలేదు.
ఎం.ఎస్.రాజు గత సినిమాల చరిత్ర చూసి ‘డర్టీ హరి’లో ఏదో స్పెషాలిటీ ఉంటుందని ఆశించిన వాళ్లకు ఆ సినిమా ప్రోమోలు షాకిచ్చాయి. బాలీవుడ్లో చూసే ఎరోటిక్ బి-గ్రేడ్ సినిమాల స్ఫూర్తితో పూర్తిగా బూతును నింపేసి ఆయన ఈ సినిమాను రూపొందించినట్లున్నారు. ఈ మధ్యే ఈ చిత్రం నుంచి హీరో హీరోయిన్లు రకరకాల మార్గాల్లో శృంగారం పండించే పాట ఒకటి విడుదల చేశారు. అది చూసి రాజు గారు ఎంత కిందికి దిగిపోయారో అనిపించింది ఆయన అభిమానులకు. మరి సినిమాలో ఇంతకుమించి ఆయనేం చూపిస్తారో చూడాలి.
This post was last modified on December 6, 2020 12:49 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…