మిస్టర్ బచ్చన్ తో తెరంగేట్రం చేసిన భాగ్యశ్రీ బోర్సేకు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి కానీ సరైన హిట్ లేక ఎదురు చూపులు కొనసాగుతూనే వచ్చాయి. విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ కింగ్డమ్ తీవ్రంగా నిరాశపరచగా దుల్కర్ సల్మాన్ కాంత తమిళంలో యావరేజ్ అనిపించుకుంటే తెలుగులో డిజాస్టర్ అయ్యింది. అందుకే ఆంధ్రకింగ్ తాలూకా మీద బోలెడు నమ్మకం పెట్టుకుంది. ఇందులో కూడా పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న క్యారెక్టరే దక్కింది. కోరుకున్నట్టుగా సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. రివ్యూలు అధిక శాతం ఒకసారి చూడచ్చని రికమండ్ చేశాయి. ఆక్యుపెన్సీలు సాయంత్రం నుంచి పెరిగాయి.
ఏ స్థాయిలో హిట్ అనిపించుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేం కానీ రామ్ అభిమానులు మాత్రం హ్యాపీగా ఉన్నారు. లెన్త్, క్లైమాక్స్ పరంగా కొన్ని ఇష్యూస్ ఉన్నప్పటికీ కంటెంట్ లో ఉన్న సోల్ జనాలకు కనెక్ట్ అయిపోవడంతో బాగా లేదనే మాట ఎవరు అనడం లేదు. ఈ మాత్రం రెస్పాన్స్ చాలు వసూళ్లు పెరగడానికి. భాగ్యశ్రీ బోర్సేతో దర్శకుడు మహేష్ బాబు ఇంచు కూడా గ్లామర్ షో చేయనివ్వలేదు. పద్దతి గల పెద్ద కుటుంబంలో అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ప్రెజెంట్ చేశారు. రామ్ లిప్ లాక్ మినహాయించి ఇబ్బంది అనిపించే సీన్స్ సాంగ్ ఏవీ లేవు. అధరచుంబనం కూడా సన్నివేశం డిమాండ్ మేరకే.
ఈ మూవీ ఆమెకు స్పెషల్ అని చెప్పడానికి కారణం లేకపోలేదు. టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత కనిపిస్తూనే ఉంది. శ్రీలీల ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ పెడుతోంది. తెలుగులో చేసినవి సూపర్ ఫ్లాప్ అవుతున్నాయి. రష్మిక మందన్న అన్ని భాషలను బ్యాలన్స్ చేసే ప్రయత్నంలో ఉండటంతో కేవలం తెలుగుకే పరిమితం కావడం లేదు. మీనాక్షి చౌదరి రేసులో వెనుకబడిపోయింది. ఇలాంటి గ్యాప్ ని సరిగా వాడుకుంటే భాగ్యశ్రీ బోర్సేకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆంధ్రకింగ్ తాలూకా దానికి మొదటి మెట్టు అయ్యేలా ఉంది. కాకపోతే ఎంత పెద్ద స్థాయిలో అనే దాన్ని బట్టి భవిష్యత్తు ఆఫర్లు ఆధారపడి ఉంటాయి.
This post was last modified on November 27, 2025 10:31 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…