థియేటర్లు తెరిచినా ప్రేక్షకులు కదిలి వస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఇంకా కరోనా విజృంభణ కొనసాగుతోన్న ఈ టైమ్‍లోనే థియేటర్లు తెరవగానే జనం బారులు తీరారు. సగం టికెట్లే అమ్మాలనే రూల్‍ని కచ్చితంగా పాటిస్తోన్న థియేటర్లకు మొదటి వారాంతంలో వచ్చిన స్పందనతో ఊరట లభించింది. ఈ ఆంక్షలు మరికొన్ని వారాల పాటు కొనసాగుతాయి కనుక ఈలోగా తక్కువ సినిమాలు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
అందరు నిర్మాతలకు, అన్ని సినిమాలకు సమ అవకాశాలు లభించేలా గిల్డ్ పెద్దలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ నాటికి థియేటర్లు పూర్తి స్థాయిలో ఆపరేట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అప్పటికి కరోనా తాకిడి ఎలా వున్నా కానీ జనం పెద్దగా పట్టించుకోరనేది స్పష్టమయింది. అయితే ఓవర్సీస్ మార్కెట్‍తోనే తంటా వచ్చి పడుతోంది. అక్కడ పరిస్థితులు మళ్లీ ఎప్పటికి మామూలు అవుతాయనేది అర్థం కావడం లేదు.
ఓవర్సీస్ మార్కెట్ సంగతెలా వున్నా పెద్ద సినిమాల విడుదల అయితే ఏప్రిల్ నుంచి మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఫస్ట్ బిగ్ రిలీజ్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ అవుతుంది. ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా విడుదల చేయడానికి దిల్ రాజు సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలిసింది. పవన్‍ని వెండితెరపై చూడాలని ఎదురు చూస్తోన్న అభిమానులు తొలి వారంలో సినిమా టాక్‍తో సంబంధం లేకుండా థియేటర్లపై ఎగబడడం ఖాయమనిపిస్తోంది.
This post was last modified on December 6, 2020 1:58 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…