న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ ఏ దశలో ఉందనేది స్పష్టమైన సమాచారం అందటం లేదు. మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చాక తిరిగి వేగవంతం చేశారు కానీ ఆగడం సాగడం జరుగుతోందనే రీతిలో పలు ప్రచారాలు చక్కర్లు కొడుతున్నాయి. ముందు నుంచి ప్యారడైజ్ టీమ్ విడుదల తేదీ విషయంలో పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది మార్చి 26 రిలీజ్ చేసే తీరతామని పలు సందర్భాల్లో ప్రమోషన్ల రూపంలో చెబుతూ వచ్చింది. కానీ ఇప్పటిదాకా ఒక పాట కానీ, విజువల్ కంటెంట్ కానీ టీమ్ వదల్లేదు. జైల్లో తీసిన చిన్న గ్లిమ్ప్స్ తప్ప ఇంకేదీ చూపించలేదు.
విశ్వసనీయ వర్గాల ప్రకారం ప్యారడైజ్ కోసం ఒక భారీ ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో నిర్మాత ఉన్నట్టు సమాచారం. టైటిల్ ఎలాగూ రివీల్ చేశారు కాబట్టి మొదటి పాట లేదా టీజర్ ని దేశ విదేశాల మీడియా ప్రతినిధులను పిలిచి వాళ్ళ మధ్యలో లాంచ్ చేయాలనే ప్రతిపాదన సీరియస్ గా పరిశీలిస్తున్నారట. ఇది ఎంత వరకు నిజమో తేలాలంటే టైం పట్టేలా ఉంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆ మధ్య షూట్ కి బ్రేక్ ఇచ్చారని, నిర్మాతతో ఏవో కాస్త విభేదాలు వచ్చాయనే గాసిప్స్ కూడా బయట తిరిగాయి. ఇప్పుడు పేర్లు లేకుండా సోషల్ మీడియాలో కొన్ని హ్యాండిల్స్ రకరకాల పుకార్లను తెరమీదకు తెస్తున్నాయి.
వీటికి చెక్ పడాలంటే ప్యారడైజ్ నుంచి సాలిడ్ గా ఏదైనా అప్డేట్ రావాలి. పోటీలో ఉన్న పెద్ది నుంచి ఆల్రెడీ చికిరి చికిరి వరల్డ్ వైడ్ సెన్సేషన్ అయ్యింది. నాని మూవీకి అనిరుద్ రవిచందర్ అంతకు మించిన పాటలు ఇవ్వాల్సి ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల అదే పని మీద ఇటీవలే చెన్నై వెళ్లాడని టాక్. వచ్చే నెల అనిరుధ్ చాలా అంటే చాలా బిజీగా మారబోతున్నాడు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ పనులు, జన నాయకుడు రీ రికార్డింగ్ తో పాటు మలేషియాలో జరిగే ఈవెంట్ తాలూకు ప్రిపరేషన్ ఇలా టైట్ షెడ్యూల్ ఉంది. మరి ప్యారడైజ్ కోసం తగినంత క్వాలిటీ సమయం కేటాయిస్తాడా అనేది వేచి చూడాలి.
This post was last modified on November 25, 2025 5:47 pm
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…
మెస్సీ ఇండియాకు రావడమే ఒక పండగలా ఉంటే, ముంబైలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దురంధర్ అంచనాలకు మించి దూసుకుపోతున్న మాట నిజమే. అఖండ 2 వచ్చాక స్లో అవుతుందనుకుంటే రివర్స్ లో నిన్న వీకెండ్…
డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…