గురువారం విడుదల కాబోతున్న ఆంధ్రకింగ్ తాలూకా మీద రామ్ తో పాటు బయ్యర్లు, థియేటర్ వర్గాలు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత రెండు మూడు వారాలుగా సాలిడ్ గా చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఏదీ లేకపోవడంతో సరైన హిట్ ఇస్తాడని రామ్ మీద నమ్మకం పెట్టుకున్నారు. ది గర్ల్ ఫ్రెండ్, రాజు వెడ్స్ రాంబాయి లాంటివి వసూళ్లు తెచ్చినప్పటికీ అన్ని ఏరియాల నుంచి యునానిమస్ గా ఒకే రిపోర్ట్స్ తెచ్చుకోలేదు. కాకపోతే నిర్మాతలకు బ్రేక్ ఈవెన్ దాటించడంతో పాటు లాభాలు వచ్చేలా చేయడంలో సక్సెసయ్యాయి. ఇప్పుడు ఆంధ్రకింగ్ కనక క్లిక్ అయితే ఏపీ తెలంగాణ సంబంధం లేకుండా హాళ్లు ఫుల్ అవుతాయి.
ఇక అసలు విషయానికి వస్తే ఆంధ్రకింగ్ తాలూకా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు మహేష్ బాబు రాసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. తమిళనాడు స్టార్ హీరోకు ఒక అభిమాని గొప్ప సహాయం చేసిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని స్టోరీ అల్లుకున్నట్టు వినికిడి. ఆ హీరో ఎవరు, ఆ ఇన్సి డెంట్ ఏంటనే వివరాలు ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు కానీ ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఇది అందరి అభిమానులకు కనెక్ట్ కావడం ఖాయమంటున్నారు. సినిమా విజయంలో ఇదే కీలకం కానుందట. రామ్ – ఉపేంద్ర మధ్య జరిగే సన్నివేశాలు ఎక్కడో టచ్ కావడం ఖాయమంటున్నారు. అందుకే రామ్ లో ఇంత కాన్ఫిడెన్స్ కాబోలు.
భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఆంధ్రకింగ్ తాలూకాకు వివేక్ మెర్విన్ ఇచ్చిన పాటలు ఆల్రెడీ వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా మెలోడీ సాంగ్స్ గురించి సంగీత ప్రియులు ఎక్కువగా మాట్లాడుకుతున్నారు. ఆపై వారం అఖండ 2 వస్తున్న నేపథ్యంలో ఆంధ్రకింగ్ తాలూకాకు పాజిటివ్ టాక్ రావడం చాలా అవసరం. తెచ్చుకుంటే కనక రామ్ ఈజీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్లకు లాగుతాడు. ఉపేంద్ర వల్ల అటు కర్ణాటకలోనూ దీని మీద బజ్ ఏర్పడింది. టైటిలే ఆయన మీదే పెట్టడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. సో నవంబర్ నెలను రామ్ ఎంత గ్రాండ్ గా, ఎంత పెద్ద హిట్టుతో ముగిస్తాడనేది చూడాలి.
This post was last modified on November 24, 2025 10:53 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…