Movie News

కొత్త సెన్సేషన్ ‘ఎకో’… అంతగా ఏముంది

మలయాళం చిత్ర పరిశ్రమ మరో బ్యాంగర్ ఇచ్చింది. ఇటీవలే విడుదలైన ఎకో కేరళ, తమిళనాడులో సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో పాటే రిలీజైన పృథ్విరాజ్ సుకుమారన్ విలయత్ బుద్ధా బాగా వెనుకబడి పోగా పబ్లిక్ రెస్పాన్స్, రివ్యూలు రెండూ నెగటివ్ గానే ఉన్నాయి. దీనికి రివర్స్ లో ఎకోకి వచ్చిన రిపోర్ట్స్ అంతకంతా వసూళ్లను పెంచుకుంటూ పోతున్నాయి. రెండింటి మధ్య బుకింగ్స్ వ్యత్యాసం యాభై శాతానికి పైగా ఉండటం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తోంది. హైదరాబాద్ లో తక్కువ షోలు ఇచ్చినప్పటికీ వేగంగా ఫుల్ అవుతున్నాయి. ఇంతకీ ఎకోలో ఏముందో ఒక లుక్ వేద్దాం.

ఇదో ఫారెస్ట్ థ్రిల్లర్. అయిదు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన కురియాచన్ కోసం చాలా మంది వెతుకుతూ ఉంటారు. కుక్కల సంరక్షకుడిగా పేరున్న ఇతనికి ఎన్నో నేరాలతో సంబంధం ఉంటుందనేది బయట జనం నమ్ముతున్న నిజం. భార్య మ్లాతి చేదతి కూడా ఈ రహస్యాన్ని గుట్టుగా కాపాడుకుంటూ వస్తుంది. నక్సలైట్లను వేధించడంతో పాటు ఎందరినో హింసించడం వెనుక కురియాచన్ హస్తం ఉందని పోలీసులు, విలన్లు వెంటపడుతూ ఉంటారు. అయితే అడవిలో ఉన్న క్రూరమైన కుక్కలకు, బయటికి కనిపించని మాఫియా ప్రపంచానికి ఉన్న లింకు ఎలా బయటపడిందనేది అసలు స్టోరీ.

సూక్ష్మ దర్శిని, కిష్కిందకాండం లాంటి స్లో మల్లువుడ్ థ్రిల్లర్స్ నచ్చినవాళ్లకు ఎకో సందేహం లేకుండా మెప్పిస్తుంది. స్లోగా మొదలుపెట్టి దాన్ని క్రమంగా థ్రిల్లర్ స్టయిల్ లోకి తీసుకెళ్లి చివర్లో విలన్ ని రివీల్ చేసిన విధానం చాల బాగుంది. దర్శకుడు దింజిత్ అయ్యతన్ స్క్రీన్ ప్లేని నడిపించిన విధానం ఆకట్టుకుంది. ఆర్టిస్టులు సౌరభ్ సచ్ దేవ్, సందీప్ ప్రదీప్, వినీత్, నరైన్ తదితరుల పెర్ఫార్మన్స్ పోటాపోటీగా సాగుతుంది. సహజమైన లొకేషన్లు, నెమ్మదిగా ఉన్నా గ్రిప్పింగ్ గా సాగే నెరేషన్ ఈ జానర్ ప్రేమికులను సంతృప్తి పరుస్తుంది. తెలుగు డబ్బింగ్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా వస్తే బెటర్.

This post was last modified on November 23, 2025 4:48 pm

Share

Recent Posts

విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…

26 minutes ago

ఓజి విలన్ రొట్టె విరిగి నేతిలో పడింది

బాలీవుడ్ ఖాన్ల ప్రభంజనంలో తనకంటూ ఒక ఉనికిని దక్కించుకున్న హీరో ఇమ్రాన్ హష్మీ. ఒకప్పుడు మంచి హిట్లతో ముద్దుల వీరుడిగా…

48 minutes ago

గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?

గుంటూరులోని తూర్పు, ప‌డ‌మ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న ప్ర‌భావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింద‌న్న…

58 minutes ago

‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు

ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…

1 hour ago

అభిమాని ఆఖరిచూపుకు స్టార్ హీరో ఎందుకు వెళ్లలేదు

'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…

4 hours ago

కెన్యా విషయంలో జాగ్రత్తలు అవసరం

కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా…

4 hours ago