వచ్చే వారం ఆంధ్రకింగ్ తాలూకా విడుదలవుతోంది. గురువారమే రిలీజ్ చేస్తుండటంతో లాంగ్ వీకెండ్ దక్కనుంది. నెక్స్ట్ వీక్ అఖండ 2 తాండవం ఉన్న నేపథ్యంలో ఓపెనింగ్స్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకునేందుకు మైత్రి మూవీ మేకర్స్ రెడీ అవుతోంది. హిట్ టాక్ వస్తే తర్వాత అఖండ 2 పోటీ వల్ల ఇబ్బంది ఉండదు, కానీ ముందైతే వీలైనంత బాక్సాఫీస్ వద్ద పిండేయాలి. థియేట్రికల్ హక్కులు రీజనబుల్ గా ముప్పై కోట్ల లోపే చేశారని ట్రేడ్ టాక్. అదే నిజమైతే బ్రేక్ ఈవెన్ సులభమవుతుంది. సినిమా బాగుందంటే ఈ మొత్తం రికవరీ అయిదారు రోజుల్లో జరిగిపోతుంది. టీమ్ టార్గెట్ అదే.
రామ్ కు గత సినిమాల ఫలితాలు ఆశాజనకంగా లేకపోయినా ఆంధ్రకింగ్ తాలూకాకు వైబ్స్ బాగున్నాయి. ఉపేంద్ర ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. రామ్ రాష్ట్రాలు తిరుగుతూ ప్రమోషన్లు చేసుకోవడంలో బిజీగా ఉన్నాడు. కూడా భాగ్యశ్రీ బోర్సే ఉంది కాబట్టి గ్లామర్ పరంగా ప్లస్ అవుతోంది. ఇక రెడ్ కార్పెట్ విషయానికి వస్తే రాజు వెడ్స్ రాంబాయి చక్కగా పెర్ఫార్మ్ చేయడం మినహాయించి మిగిలిన కొత్త సినిమాలన్నీ కనీస స్థాయిలో ఆడియన్స్ ని ఆకర్షించలేక నీరసపడ్డాయి. కాసింత డీసెంట్ టాక్ వచ్చిన వాటికి సైతం షోలు క్యాన్సిలవుతున్నాయి.
వచ్చేవారం రాజు వెడ్స్ రాంబాయి నెమ్మదిస్తుంది. ఒకవేళ జోరు కొనసాగించినా దానికి ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు తక్కువే కాబట్టి వాళ్లంతా ఆంధ్రకింగ్ తాలూకా కోసం ఎదురు చూస్తారు. రామ్ కున్న ఇమేజ్ దృష్యా మాస్ మద్దతు ఎలాగూ ఉంటుంది. పైగా ఫ్యాన్ కు, స్టార్ హీరోకు మధ్య ఎమోషనల్ డ్రామాగా ప్రచారం జరగడంతో అందరు హీరోల అభిమానులు కనెక్ట్ అయితే మాత్రం కలెక్షన్లు కొల్లగొట్టేయొచ్చు. దర్శకుడు మహేష్ బాబు అందుకే చాలా ధీమాగా ఉన్నాడు. దీని ఫలితాన్ని బట్టే రామ్ నెక్స్ట్ ఎవరితో చేయాలనే దాని మీద కంక్లూజన్ కు వస్తాడట. చూడాలి మరి ఎవరికి ఛాన్స్ దక్కుతుందో.
This post was last modified on November 22, 2025 6:40 pm
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…
భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…