బాలీవుడ్ స్టార్ కిడ్స్‌తో పార్టీలు, వింత వింత ఫోజ్ ఆకారాలు, అసలు ఏం చేస్తాడో ఎవరికీ తెలియని ఒక మిస్టరీ ప్రొఫెషన్.. ఇదీ సోషల్ మీడియా సెన్సేషన్ ఓర్రీ గురించి అందరికీ తెలిసింది. నిత్యం సెలబ్రిటీలతో చిల్ అవుతూ కనిపించే ఓర్రీ, ఇప్పుడు అనూహ్యంగా ఓ భారీ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. ఏకంగా రూ. 252 కోట్ల విలువైన మాదకద్రవ్యాల కేసులో విచారణకు రావాలంటూ ముంబై పోలీసులు అతనికి సమన్లు జారీ చేయడం ఇప్పుడు బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలు ఈ కేసు కథేంటంటే.. మార్చి 2024లో ముంబై పోలీసులు మహారాష్ట్రలోని సాంగ్లీలో ఉన్న ఓ డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీని సీజ్ చేశారు. అక్కడ ఏకంగా 126 కిలోల మెఫెడ్రోన్ దొరికింది. దీని విలువ మార్కెట్లో రూ. 252 కోట్లు ఉంటుంది. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న కీలక సూత్రధారి సలీం షేక్ అలియాస్ ‘లావిష్’. ఇతన్ని దుబాయ్ నుంచి అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకొచ్చారు. ఇతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన సలీం డోలాకు అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.
పోలీసుల విచారణలో ఈ సలీం షేక్ సంచలనం రేపే విషయాలు బయటపెట్టాడు. తాను ఇండియాలోనూ, విదేశాల్లోనూ సెలబ్రిటీల కోసం హై ప్రొఫైల్ ‘రేవ్ పార్టీలు’ అరేంజ్ చేసేవాడినని ఒప్పుకున్నాడు. ఆ పార్టీలకు ఎవరెవరు వచ్చేవారో చెబుతూ.. ఓర్రీ పేరును కూడా ప్రస్తావించాడు. కేవలం ఓర్రీ మాత్రమే కాదు, శ్రద్ధా కపూర్, నోరా ఫతేహి వంటి మరికొందరు స్టార్ల పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈ డ్రగ్స్ రాకెట్ మూలాలు బాలీవుడ్‌లో ఎంత లోతుగా ఉన్నాయోనని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, ఓర్రీని పోలీసులు ఇంకా నిందితుడిగా చేర్చలేదు. సలీం షేక్ చెప్పిన మాటల్లో నిజమెంతో తేల్చడానికి, కేవలం విచారణ కోసమే పిలిచారు. గురువారం హాజరుకావాలని నోటీసులు ఇవ్వగా, తాను ప్రస్తుతం ఊర్లో లేనని, నవంబర్ 25 తర్వాత వస్తానని ఓర్రీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సమన్లు వచ్చిన సమయంలోనే ఓర్రీ ముంబైలో ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించడం గమనార్హం.
ఓర్రీ ఇలా చట్టపరమైన ఇబ్బందుల్లో పడటం ఇదే తొలిసారి కాదు. గతంలో జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో, నిషేధిత ప్రాంతంలో మద్యం సేవించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ కేసులో పేరు వినిపించడం అతని ఇమేజ్‌కి పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇది కేవలం విచారణే అయినా, తీగ లాగితే డొంక కదిలినట్లు.. ఓర్రీ నుంచి ఇంకెన్ని సంచలనాలు బయటపడతాయో చూడాలి.
This post was last modified on November 21, 2025 11:26 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…