హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి 22 సంవత్సరాల తర్వాత కూడా చేతి నిండా సినిమాలు అది కూడా కథానాయికగానే అంటే ఆశ్చర్యం కాదు షాక్ కలిగించే విషయం. నయనతార ఎందుకు లేడీ సూపర్ స్టార్ అయ్యిందో అర్థం చేసుకోవాలంటే తన డిమాండ్ చూస్తే సరి. ప్రస్తుతం తన నుంచి రాబోతున్నవి ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది చిత్రాలున్నాయి. ఇంకా కొత్తవి సైన్ చేయడానికి కాల్ షీట్లు లేక వెయిటింగ్ లో పెట్టింది. ఇటీవలే బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే పీరియాడిక్ యాక్షన్ గ్రాండియర్ లో తననే తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగోసారి బాలయ్యతో జట్టు కట్టడం పట్ల ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.
చిరంజీవితో చేసిన మన శంకరవరప్రసాద్ గారు జనవరి సంక్రాంతికి విడుదల కానుంది. యష్ టాక్సిక్ ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తి చేసుకుని మార్చి రిలీజ్ కు సిద్ధమవుతోంది. వంద కోట్ల బడ్జెట్ తో సుందర్ సి తీస్తున్న మూకుతి అమ్మన్ 2 (అమ్మోరు తల్లి సీక్వెల్) ని కేవలం తన పేరు మీదే బిజినెస్ చేస్తున్నారు. సగం ఓటిటి హక్కుల ద్వారానే రికవర్ అయిపోతుందట. ఇవి కాకుండా డియర్ స్టూడెంట్స్ – పాట్రియాట్ అనే మలయాళం మూవీస్ తో పాటు మన్నన్ గట్టి సిన్స్ 1960, హాయ్, రక్కయి అనే తమిళ సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయ్. ఇవన్నీ 2026లోనే థియేటర్ ప్రేక్షకులను పలకరిస్తాయి.
ఒకపక్క శ్రీలీల, రష్మిక మందన్న లాంటి యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్న టైంలోనూ నయనతార ఇంత డిమాండ్ లో ఉండటం విశేషం. ఇద్దరు బిడ్డల తల్లిగా ఉంటూ కూడా షెడ్యూల్స్ మానేజ్ చేసుకోవడం చిన్న విషయం కాదు. భర్త విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసెంబర్ మూడో వారం విడుదలకు రెడీ అవుతోంది. ఇందులో నయన్ నటించలేదు కానీ చాలా గ్యాప్ తర్వాత శ్రీవారు హిట్టు కొడతాడనే నమ్మకంతో ఎదురు చూస్తోంది. త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాకు కూడా అడిగారట కానీ ఎందుకో మరి లక్ష్మి కాంబో కార్యరూపం దాల్చలేదు. నయన్ డైరీ చూస్తే సీనియర్లకు ఈర్ష్య కలగడంలో ఆశ్చర్యం ఏముంది.
This post was last modified on November 20, 2025 10:54 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…