అదేంటీ పుష్పతో ఎవరికి ఎందుకు పోలిక, ఏమిటా లింక్ ఏమిటనుకుంటున్నారా. విషయం చదివితే మీకే అర్థమవుతుంది. మహేష్ బాబు వారణాసిలో విలన్ కుంభగా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన కొత్త సినిమా విలయత్ బుద్దా ఈ వారం విడుదల కానుంది. మళయాలంతో పాటు తెలుగు ట్రైలర్ కూడా వదిలారు. ట్విస్ట్ ఏంటంటే ఇది అచ్చం పుష్ప లాగే అనిపించడం. అడవులు, ఎర్ర చందనం స్మగ్లింగ్, పోలీసుల కళ్ళు గప్పడం, ఎత్తులు పై ఎత్తులు ఇలా చాలానే కనిపిస్తున్నాయి. ప్రమోషన్ల కోసం ఎక్కడికి వెళ్లినా ఇంటర్వ్యూలు ఇచ్చినా పృథ్విరాజ్ సుకుమారన్ కు ఇదే ప్రశ్న ఎదురవుతోంది.
దానికాయన సవివరంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. పుష్ప రాక ముందే విలయత్ బుద్దాని ప్లాన్ చేసుకున్నారు. ప్రముఖ రచయిత జీఆర్ ఇందు గోపాలన్ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. అయ్యప్పనుం కోశియుమ్ దర్శకుడు సాచి సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆయన 2020లో హఠాత్తుగా కన్ను మూశారు. ఆ బాధ్యతను సాచి అసిస్టెంట్ జయన్ నంబియార్ తీసుకున్నారు. ఇది ఓకే అనుకున్న టైంలో పుష్ప నిర్మాణంలో ఉందని కానీ అందులోనూ ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఉందని కానీ పృథ్విరాజ్ బృందానికి తెలియలేదు. అలా షూటింగ్ ఆలస్యమైపోయి 2025 దాకా వచ్చేసింది.
కథ పరంగా ఎలాంటి పోలికలు ఉండవని, తను చేసిన డబుల్ మీనన్ క్యారెక్టర్ కు పుష్ప రాజ్ కు ఎక్కడా పొంతన ఉండదని అంటున్నారు. పృథ్విరాజ్ అన్నదాంట్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే విలయత్ బుద్దా హీరో, పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే ఈగో క్లాష్ కాదు. ఇక్కడ వేరే సెటప్ ఉంటుంది. కాకపోతే అడవులు, దుంగలు లాంటి వ్యవహారాలు కొద్దిగా సేమ్ అనిపిస్తాయి. మరి పృథ్విరాజ్ అన్నట్టు ఒకవేళ అసలే మాత్రం పోలిక లేకపోతే ఇబ్బంది లేదు. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ హిట్ చేసి ఇస్తారు. అలా కాదని ఏ మాత్రం సారూప్యతలు కనిపించినా అసలు సమస్య అక్కడ మొదలవుతుంది.
This post was last modified on November 17, 2025 10:40 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…