90వ దశకంలో అప్పటి తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసిన సినిమా.. అల్లరి ప్రియుడు. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో రాజశేఖర్, రమ్యకృష్ణ, మధుబాల ముఖ్య పాత్రలు పోషించారు. ఇందులో రాజశేఖర్, రమ్యకృష్ణల మధ్య కెమిస్ట్రీ.. వారి మధ్య వచ్చిన పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి దీర్ఘ సుమంగళీభవ, బలరామకృష్ణులు తదితర చిత్రాల్లో నటించారు.
ఐతే 1998 తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. ఐతే సుదీర్ఘ విరామానంతరం ఈ జోడీని తెరపై చూడబోతున్నారు తెలుగు ప్రేక్షకులు. కొంచెం గ్యాప్ తర్వాత రాజశేఖర్ లీడ్ రోల్ చేస్తున్న సినిమాలో ఆయనకు జోడీగా రమ్యకృష్ణ నటించనుందట. తమిళ హిట్ మూవీ ‘లబ్బర్ పందు’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది.
గ్రామీణ క్రికెట్ చుట్టూ తిరిగే ‘లబ్బర్ పందు’లో దినేష్ చేసిన పాత్రను తెలుగులో రాజశేఖర్ చేయబోతున్నారట. పిట్టగోడ, 35 చిత్రాల్లో హీరోగా నటించిన విశ్వదేవ్ రాచకొండ మాతృకలో అర్జున్ కళ్యాణ్ చేసిన పాత్రను చేస్తున్నాడు. రాజశేఖర్ తనయురాలే ఇందులో హీరోయిన్‌గా కనిపించనుంది. తమిళంలో శ్వాసిక చేసిన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది ఇంకా వెల్లడి కాలేదు.
రాజశేఖర్ చివరి చిత్రం ‘శేఖర్’ను డైరెక్ట్ చేసిన ఆయన భార్య జీవితనే ఈ బాధ్యతలు అందుకుంటుందేమో చూడాలి. ఒకప్పుడు రాజశేఖర్ రీమేక్ సినిమాలతోనే మంచి విజయాలు అందుకున్న మాట వాస్తవం కానీ.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇతర భాషల నుంచి అరువు తెచ్చుకున్న కథలతో ఆయన చేసిన గడ్డం గ్యాంగ్, శేఖర్ లాంటి చిత్రాలు దారుణమైన ఫలితాలు అందుకున్నాయి. ఈ అనుభవాల తర్వాత కూడా ఆయన మళ్లీ రీమేక్ రిస్క్‌కు రెడీ అవుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on November 17, 2025 6:39 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…