Movie News

ఆంధ్రా కింగ్ తాలూకా.. డేట్ మారింది

న‌వంబ‌రు నెల‌లో సాధార‌ణంగా భారీ చిత్రాల సంద‌డి ఉండ‌దు. చిన్న‌, మిడ్ రేంజ్ మూవీస్ మాత్ర‌మే విడుద‌ల‌వుతుంటాయి. ఈ నెల‌లో తొలి రెండు వారాల్లో గ‌ర్ల్ ఫ్రెండ్, కాంత లాంటి మిడ్ రేంజ్ సినిమాలు ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించాయి. వీటిలో గ‌ర్ల్ ఫ్రెండ్ ఓ మోస్త‌రుగా ఆడింది. కాంత అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. వ‌చ్చే వారం 12ఏ రైల్వే కాల‌నీ స‌హా కొన్ని చిన్న సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

ఐతే ఈ నెల మొత్తంలో ఎక్కువ అంచ‌నాలున్న సినిమా అంటే.. రామ్ ప్ర‌ధాన పాత్ర పోషించిన ఆంధ్రా కింగ్ తాలూకా అనే చెప్పాలి. ఎక్కువ‌గా మాస్ మూవీస్ చేసే రామ్.. ఈసారి ఒక ఫ్యాన్ బ‌యోపిక్ అంటూ ఈ వెరైటీ మూవీ చేశాడు. ఇందులో ఉపేంద్ర స్టార్ హీరో పాత్ర పోషించ‌గా.. ఆయ‌న‌కు అభిమానిగా రామ్ క‌నిపించ‌నున్నాడు. మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి ఫేమ్ మ‌హేష్ బాబు ఈ చిత్రాన్ని రూపొందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది.

ఆంధ్రా కింగ్ తాలూకాకు మొద‌ట ప్ర‌క‌టించిన రిలీజ్ డేట్ న‌వంబ‌రు 28. కానీ ఇప్పుడు డేట్ మార్చారు. అలా అని ఆ సినిమా ఏమీ వాయిదా ప‌డ‌ట్లేదు. అనుకున్న దాని కంటే ఒక రోజు ముందే ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది ఆంధ్రా కింగ్ తాలూకా. న‌వంబ‌రు 27నే సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. ముందు యుఎస్ ప్రిమియ‌ర్స్‌ను రిలీజ్ డేట్ కంటే రెండు రోజుల ముందు వేయాల‌ని అనుకున్నారు. ఇప్పుడు మొత్తంగా రిలీజ్ డేటే ఒక రోజు ముందుకు వ‌చ్చింది. అంటే యుఎస్ ప్రిమియ‌ర్స్ ఎప్ప‌ట్లాగే ఒక రోజు ముందు ప‌డ‌నున్నాయి.

గురువారం రోజు రిలీజ్ కావ‌డం వ‌ల్ల లాంగ్ వీకెండ్ సినిమాకు అడ్వాంటేజ్ కానుంది. త‌ర్వాతి వారంలో అఖండ‌-2 లాంటి భారీ చిత్రం రిలీజ‌వుతుండ‌డంతో గ్యాప్ కొంచెం ఎక్కువ ఉండేలా సినిమాను ఒక రోజు ముందుకు తీసుకొచ్చిన‌ట్లున్నారు. 28న కీర్తి సురేష్ సినిమా రివాల్వ‌ర్ రీటా రిలీజ్ కానుండ‌గా.. దాంతో క్లాష్ కూడా లేకుండా చూసుకున్న‌ట్లున్నారు. చాన్నాళ్లుగా స‌రైన హిట్ లేని రామ్‌కు ఈ సినిమా స‌క్సెస్ కావ‌డం చాలా అవ‌స‌రం.

This post was last modified on November 16, 2025 11:15 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago