ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు ఈ పేరు తెలుగు, తమిళ యువతకు హార్ట్ బీట్‌గా మారిపోయింది. కేవలం మూడే మూడు సినిమాలతో అతను కోట్లమంది యువతకు ఫేవరెట్‌గా మారిపోయాడు. చూడ్డానికి ఒక పక్కింటి కుర్రాడిలా సాధారణంగా అనిపిస్తాడు కానీ.. తన పెర్ఫామెన్స్ చూస్తే ఫిదా అయిపోతాం. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో భారీ విజయాలు అందుకున్న అతను.. ‘డ్యూడ్’తో సక్సెస్ స్ట్రీక్‌ను కొనసాగించాడు. వరుసగా మూడో వంద కోట్ల సినిమా అతడి ఖాతాలో చేరింది.
ఐతే దీపావళికి విడుదలైన ‘డ్యూడ్’కు రివ్యూలు, టాక్ కొంచెం మిక్స్డ్‌గానే వచ్చాయి. ‘డ్రాగన్’తో పోల్చి ఈ సినిమా విషయంలో పెదవి విరిచారు ప్రేక్షుకులు. సినిమాలో విషయం ఉన్నప్పటికీ.. కొన్ని ఎపిసోడ్లు హైలైట్ అయినప్పటికీ.. ఎగుడుదిగుడుగా సాగిన కథనం విషయంలో విమర్శలు వచ్చాయి. అయినా సరే ఆ టాక్‌ను, బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీని తట్టుకుని ఆ చిత్రం హిట్టయింది.
కట్ చేస్తే ఇప్పుడు ‘డ్యూడ్’ ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ రెండు రోజుల కిందట్నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేస్తోంది. ఇక్కడ ఈ సినిమాకు రెస్పాన్స్ మామూలుగా లేదు. దీంతో పాటు ఈ వారం ‘తెలుసు కదా’, ‘కే ర్యాంప్’ సహా పలు చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. కానీ వాటన్నింటినీ పక్కకు నెడుతూ ‘డ్యూడ్’ లీడ్ తీసుకుంది. నేరుగా ఓటీటీలో ఈ సినిమా చూస్తున్న వాళ్లందరూ సూపర్, కేక అంటూ కొనియాడుతున్నారు. ఇది ఇంకా పెద్ద హిట్టవ్వాల్సిన సినిమా అంటున్నారు.
నిజానికి ‘డ్యూడ్’కు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ చిత్రం ట్రోలింగ్‌కు గురవుతుందేమో అనుకున్నారు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఎపిసోడ్ విషయంలో నెగెటివిటీ తప్పదనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా టాక్ అలా లేదు. ఫుల్ పాజిటివిటీ కనిపిస్తోంది. రెస్పాన్స్ చూస్తుంటే ఓటీటీలో ‘డ్యూడ్’ను బ్లాక్ బస్టర్ అనొచ్చు. మరోవైపు బాక్సాఫీస్ దగ్గర సరిగా ఆడని ‘తెలుసు కదా’కు కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది. ‘కే ర్యాంప్’ గురించి డిస్కషన్ తక్కువగానే ఉంది.
This post was last modified on November 15, 2025 3:04 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…