చాలా ఏళ్ల నుంచి తెలుగులో తెలుగు హీరోయిన్లు నటించడం తగ్గిపోతోంది. తెలుగు హీరోయిన్లు రావడమే తక్కువ అంటే.. వాళ్లకు మంచి ఛాన్సులూ దక్కవు. పెద్ద సినిమాలు చేయకపోయినా.. చేసిన వాటిలో మంచి పాత్రలతో ఆకట్టుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి. మను, కలర్ ఫొటో, గామి.. ఇలా తన ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కొంచెం గ్యాప్ తర్వాత ఆమె సంతాన ప్రాప్తిరస్తు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తనకు మంచి పాత్రే దక్కింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాను నటించిన ఒక సినిమా విషయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ సందర్భాన్ని చాందిని చౌదరి గుర్తు చేసుకుంది.
అర్జున్ రెడ్డి సినిమా రిలీజై పెద్ద హిట్టయిన టైంలోనే తాను ఒక సినిమాలో నటించానని.. అందులో ముందు లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు ఏమీ లేవని.. కానీ అర్జున్ రెడ్డి సక్సెస్ నేపథ్యంలో అలాంటి సన్నివేశాలు ఉంటేనే సినిమాలు ఆడతాయనే భావనకు ఆ సినిమా టీం వచ్చిందని చాందిని చెప్పింది. దర్శకుడు, నిర్మాతతో పాటు టీంలో ముఖ్యులైన కొందరు.. ముద్దు సన్నివేశాలు, ఇంటిమేట్ సీన్ల కోసం తనను బలవంతం చేశారని ఆమె చెప్పింది. తాను నో చెప్పినా వినలేదని.. తప్పక ఆ సీన్లు చేయాల్సిందే అని తేల్చి చెప్పారని చాందిని గుర్తు చేసుకుంది.
సినిమా ఫ్లాప్ అయితే నీదే బాధ్యత అంటూ తనను బ్లాక్‌మెయిల్ కూడా చేశారని.. దీంతో తనకు కాళ్లు చేతులు ఆడలేదని.. ఏం చేయాలో పాలుపోలేదని ఆమె చెప్పింది. ఐతే అదే సమయంలో టీం వెళ్లి హీరోకు విషయం చెప్పగా.. హీరోయిన్‌కు అవి ఓకేనా అని అడిగాడని.. హీరోయిన్‌దేముంది, ఇష్టమున్నా లేకపోయినా చేయాల్సిందే అంటూ హీరో మీద ఒత్తిడి తెచ్చారని.. అప్పుడా హీరో తన కోసం నిలబడ్డాడని.. ఆమె ఓకే ఆన్నా కూడా తాను ఆ సీన్స్ చేయనని తేల్చి చెప్పేశాడని చాందిని వెల్లడించింది. చాందిని ఆ సినిమా పేరు చెప్పకపోయినా.. ఆమె చెప్పిన టైమింగ్ అదీ గమనిస్తే అది రాహుల్ రవీంద్రన్‌కు జోడీగా చాందిని నటించిన హౌరా బ్రిడ్జ్ అని అర్థమవుతోంది.
This post was last modified on November 15, 2025 2:14 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…