దర్శకత్వం చేయాలని వచ్చి, ఆ శాఖలో పని కూడా చేసిన కొందరు తర్వాత అనుకోకుండా నటులుగా మారిన సందర్భాలు టాలీవుడ్లో చాలానే ఉన్నాయి. అల్లరి నరేష్, నాని, రాజ్ తరుణ్, సప్తగిరి లాంటి వాళ్లు ఇందుకు ఉదాహరణ. వాళ్లందరికీ ఎప్పుడో ఒకప్పుడు దర్శకత్వం చేపట్టాలనే ఆశ ఉంది.
ఐతే వీరి కంటే ముందు కమెడియన్ సునీల్ దర్శకుడు అయిపోతున్నాడనే రూమర్ ఒకటి టాలీవుడ్లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. సునీల్ బేసిగ్గా దర్శకుడు కావాలనే లక్ష్యంతో ఏమీ ఇండస్ట్రీకి వచ్చినట్లు ఎప్పుడూ చెప్పలేదు. తన మిత్రుడు త్రివిక్రమ్ రచయితగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉండగా.. అతను నటుడవుదామని హైదరాబాద్ వచ్చేశాడు.
ముందు చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి తర్వాత కమెడియన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆపై హీరో అయ్యాడు.ఇప్పుడు క్యారెక్టర్, విలన్ రోల్స్ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం పుష్పతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్న సునీల్ త్వరలోనే దర్శకుడిగా మారనున్నట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
ఓ మరాఠీ చిత్రం నచ్చి దాన్ని మన నేటివిటీకి తగ్గట్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నాడట సునీల్. అతనో రైటింగ్ టీంతో కలిసి పని చేస్తున్నాడట. సునీల్ ఓ నిర్మాతను కూడా ఒప్పించినట్లు చెబుతున్నారు. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి. ప్రస్తుతం సునీల్ పుష్పతో పాటు కొన్ని పెద్ద సినిమాల్లో నటిస్తున్నాడు.
This post was last modified on December 3, 2020 8:16 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…