ప్యాన్ ఇండియా హీరోలు ఒక సమయంలో ఒక సినిమా చేయడానికే కిందా మీద పడుతూ రెండు మూడేళ్లు తీసుకుంటున్న ట్రెండ్ లో పానీపూరిలు తిన్నంత ఈజీగా ప్రభాస్ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతు చిక్కడం లేదు. తాజాగా డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ కథకు ఇంప్రెస్ అయిన డార్లింగ్ ఓకే చెప్పేశాడట. ఆర్ఆర్ఆర్ నాటు నాటుకి కొరియోగ్రఫీ సమకూర్చడం ద్వారా ఆస్కార్ స్టేజి ఎక్కిన ఈ నృత్య దర్శకుడికి ఇది పెద్ద ప్రమోషన్. ఎందుకంటే టయర్ 2 హీరో దొరికితే అదే గొప్పనే పరిస్థితిలో ఏకంగా ప్రభాస్ తో మూవీ అంటే చేతిలో రెండు వేల కోట్ల ప్రాజెక్టు ఉన్నట్టే. ఇంతకన్నా ఏం కావాలి.
దీని గురించిన అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. నిర్మాణ సంస్థ తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ఇతర సోర్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇదో యానిమేషన్ మూవీ అని, ప్రభాస్ లైవ్ గా నటించకపోవచ్చని, కేవలం తన పాత్రకు డబ్బింగ్ మాత్రమే చెబుతారని అంటున్నారు. ఇదింకా నిర్ధారణ కావాల్సి ఉంది. డాన్స్ మాస్టర్లు డైరెక్టర్లు కావడం కొత్త కాదు.లారెన్స్ రాఘవేంద్ర, ప్రభుదేవా బ్లాక్ బస్టర్లు సాధించారు. అమ్మ రాజశేఖర్ ఖాతాలోనూ సూపర్ హిట్ ఉంది. ప్రేమ్ రక్షిత్ కి వీళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకుని ఉండొచ్చు.
జనవరిలో రాజా సాబ్ విడుదల కాగానే ప్రభాస్ స్పిరిట్ లో బిజీ అయిపోతాడు. ఆ తర్వాత ఫౌజీ వేసవి లేదా దసరా పండక్కు ఉంటుంది. అటుపై కల్కి 2, సలార్ 2 శౌర్యంగపర్వం లైన్ లో ఉన్నాయి. ఇవి కాకుండా ప్రశాంత్ వర్మతో చేయాల్సిన సినిమా ఇంకా ఫైనల్ కావాలి. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఎవరూ ఇన్నేసి సినిమాలతో బిజీగా లేరన్నది వాస్తవం. ఈ కాంబోకి పునాది రాజా సాబ్ షూటింగ్ లో పడిందట. గ్యాప్ లో ప్రేమ్ రక్షిత్ ఇచ్చిన నెరేషన్ ప్రభాస్ కి విపరీతంగా నచ్చేయడంతో ఎస్ చెప్పాడట. అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. ఈ టైంలో కొత్త దర్శకుడితో అంటే రిస్క్ అని వాళ్ళ ఫీలింగ్. హీరోనా కాదానేది తేలాల్సి ఉంది.
This post was last modified on November 15, 2025 1:39 pm
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ రూటు మాసరుస్తున్నారా..? నిన్నా మొన్నటి వరకు ప్రధాని మోదీకి నమ్మకమైన వ్యక్తిగా కొనసాగిన…
పంజాబ్‌లోని పాటియాలా జిల్లాలో ఉన్న చిత్కార యూనివర్సిటీలో దెయ్యం ఉందంటూ సోషల్ మీడియాలో వ్యాపించిన ఒక పుకారు తీవ్ర ఉద్రిక్తతకు…
ఒక పార్టీపై చర్యలు తీసుకున్నా.. ఒక పార్టీ నాయకుడిపై చర్యలు తీసుకున్నా.. సహజంగానే ప్రజల్లో అంతో ఇంతో సింపతీ దక్కుతుంది.…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజకీయాలు కూటమిలోనే అంతర్గత వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఈ నియోజకవర్గం పూర్తిగా పట్టణ పరిధిలో ఉంది.…
ఫిలిం నగర్ వర్గాల్లో కొత్త ప్రచారం వెంకటేష్ అభిమానులను టెన్షన్ కు గురి చేస్తోంది. అక్టోబర్ 2 నుంచి ఆల్రెడీ…
దానం నాగేందర్‌పై వేటు పడడం.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయం కావడం.. ఇటీవల కాలంలో బీఆర్ ఎస్ పార్టీ చేసిన…