శర్వానంద్ సినిమా చూసి నెలలు కాదు ఏడాది పైగానే గడిచిపోయింది. మనమే తర్వాత మళ్ళీ తెరమీద కనిపించలేదు. బైకర్ తో వచ్చే నెల డిసెంబర్ 6 థియేటర్లకు రాబోతున్న సంగతి తెలిసిందే. బైక్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ తో అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ ఛేజింగ్ డ్రామాని ఏకంగా హాలీవుడ్ మూవీ ఎఫ్1 తో పోల్చడం చూస్తే టీమ్ నమ్మకం మాములుగా లేదు. అయితే ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న విషయం ఒకటే. ముందు రోజు అఖండ 2 రిలీజ్, దానికి వారం ముందు ఆంధ్రకింగ్ తాలూకా పెట్టుకుని ఇంత కాంపిటీషన్ మధ్య రావడం ఎందుకాని. సోలో అయితే బైకర్ ఇంకా బాగా అదరగొడుతుందని వీళ్ళ నమ్మకం.
అసలు ట్విస్టు మరొకటి ఉంది. శర్వానంద్ మరో చిత్రం నారి నారి నడుమ మురారిని సంక్రాంతికే విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నారట. బైకర్ చేసేదే పెద్ద రిస్క్. ఇప్పుడీ నారినారి కూడా పండగ బరిలో దిగితే ఇది అంత కన్నా రెట్టింపు గ్యాంబ్లింగ్ మరొకటి ఉండదు. ఎందుకంటే మన శంకరవరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, ది రాజా సాబ్, జన నాయకుడు, పరాశక్తితో ఆల్రెడీ అరడజను సినిమాలు లైన్ లో ఉన్నాయి. వీటి మధ్య ఏడో ఎంట్రీగా నారీనారీ నడుమ మురారి ఎదురీదాల్సి ఉంటుంది. సినిమా బాగుండొచ్చు. ముందైతే సరిపడా థియేటర్లు దొరకాలి కదా.
సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన నారీనారీ నడుమమురారి హీలేరియస్ గా వచ్చిందట. అంత మాత్రాన కాంపిటీషన్ కు ఎదురెళితే ఓపెనింగ్స్ తో పాటు ఫైనల్ రన్ ప్రభావితం చెందుతాయి. పైన చెప్పిన వాటిలో ఒకటో రెండో వాయిదా పడతాయన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఎవరికి వారు డెడ్ లైన్స్ పెట్టుకుని మరీ పని చేస్తున్నారు. అలాంటప్పుడు ఎవరో తప్పుకుంటారని ఆశించి డేట్ వేసుకోవడం సబబు కాదేమో. బైకర్ రిలీజ్ తర్వాత నారి నారి పబ్లిసిటీ పర్వం మొదలవ్వొచ్చు. సీజన్ ఎంపిక వెనుక ఓటిటితో చేసుకున్న డీల్ కూడా ఒక కారణమని అనఫీషియల్ టాక్.
This post was last modified on November 14, 2025 2:33 pm
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…