విజయ్ దేవరకొండకు తెర మీద ముద్దులు కొత్తేమీ కాదు. రష్మిక మందన్నా కూడా కొన్ని చిత్రాల్లో లిప్ లాక్స్ చేసింది. వీళ్లిద్దరి మధ్య కూడా ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో ముద్దులు చూడొచ్చు. కానీ వాటిని మించి ఇప్పుడు ఆఫ్ ద స్క్రీన్ ఇద్దరి మధ్య ఒక క్యూట్ కిస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. రష్మిక ప్రధాన పాత్ర పోషించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ బుధవారం రాత్రి ఘనంగా జరిగింది.
అనుకున్నట్లే ఈ వేడుకకు విజయ్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అతను ఆడిటోరియంలోకి అడుగు పెట్టాక నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు అందరినీ కలిశాక రష్మిక దగ్గరికి వచ్చాడు. రాగానే ఆమెకు గట్టిగా ఒక షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అంతటితో ఆగిపోకుండా తన చేతి మీద ముద్దు పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేసింది.
విజయ్, రష్మిక కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. గత నెలలో వీళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరి వేళ్ల మీద ఉన్న ఉంగరాలు వీరి ఎంగేజ్మెంట్‌ను ధ్రువీకరించాయి. నిశ్చితార్థం తర్వాత ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా ఒకరి గురించి ఒకరేం మాట్లాడతారు.. ఎలా వ్యవహరిస్తారు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇద్దరూ కలిసి కనిపించిన తొలి మూమెంట్లోనే రష్మికకు విజయ్ క్యూట్ కిస్ ఇవ్వడం అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. ఆపై రష్మిక స్టేజ్ మీద మాట్లాడుతూ.. విజయ్‌ని విజ్జు అని సంబోధించడం.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక విజయ్ దేవరకొండ ఉండాలనే స్టేట్మెంట్ ఇవ్వడం.. విజయ్ కూడా రష్మికను ఉద్దేశించి గొప్పగా మాట్లాడడం వీరి ప్రేమ బంధానికి సూచికగా నిలిచింది.
This post was last modified on November 13, 2025 7:18 pm
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…