దక్షిణాదిన ప్రతి దర్శకుడు ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకునే హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. అలాంటి హీరోతో కేవలం రెండు సినిమాల అనుభవంతోనే పని చేసే అవకాశం దక్కించుకున్నాడు పా.రంజిత్. అతను అంతకుముందు తీసిన రెండు సినిమాలు కూడా మరీ పెద్ద సినిమాలు కూడా కాదు. వాటిని చూసి రజినీ అతడికి అవకాశం ఇవ్వడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది.
కానీ రజినీ చేసిన కబాలి సినిమా ప్రోమోలతో రజినీ అభిమానుల్నే కాక అందరి దృష్టినీ ఆకర్షించిన సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు రంజిత్. కానీ ఆ అంచనాలను కబాలి ఎంతమాత్రం అందుకోలేకపోయింది. అయినా సరే.. రజినీ అతడికి మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఈసారి కాలాతోనూ అతను మెప్పించలేదు.
కాలా వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా రంజిత్ నుంచి కొత్త సినిమా ఏదీ రాలేదు. మధ్యలో రంజిత్ నిర్మాతగా మారి సినిమాలు తీశాడు కానీ.. మెగా ఫోన్ మాత్రం పక్కన పెట్టేశాడు. ఐతే ఎట్టకేలకు అతడి దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది. పేరు.. సర్పట్ట. ఆర్య హీరోగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు రంజిత్. ఆర్య ఈ మధ్య విపరీతంగా కండలు పెంచి నమ్మశక్యం కాని లుక్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అదంతా ఈ సినిమా కోసమే అని అర్థమవుతోంది.
బాక్సింగ్ రింగ్‌లో గండరగండడిలా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు ఆర్య. ఫస్ట్ లుక్ సెటప్ అంతా చూస్తే ఇదొక పీరియడ్ మూవీ అని.. కొన్ని దశాబ్దాల వెనకటి నేపథ్యంలో రంజిత్ సినిమా తీస్తున్నాడని అర్థమవుతోంది. కబాలి, కాలా మాదిరి సామాజిక ఇతివృత్తం కాకుండా ఈసారి రూటు మార్చి కమర్షియల్ సినిమానే తీసేలా కనిపిస్తున్నాడు రంజిత్.
This post was last modified on December 2, 2020 8:38 pm
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…