Movie News

అక్కినేని కుటుంబంపై కొండా కామెంట్స్.. 13 నెలలకు పశ్చత్తాపం

గత ఏడాది తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. మాజీ మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. నాగచైతన్య మాజీ భార్య సమంత పేరు ప్రస్తావించి.. పత్రికలో రాయలేని విధంగా ఆమె దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్లపై సర్వత్రా తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఒక మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సోషల్ మీడియాలో ఊరూ పేరు లేని వాళ్లలా అలాంటి కామెంట్లు చేయడమేంటనే ప్రశ్నలు తలెత్తాయి. అంత వ్యతిరేకత వచ్చాక కూడా సురేఖ తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణలు చెప్పలేదు. తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబం తీవ్రంగానే స్పందించింది. నాగార్జున.. సురేఖ మీద పరువు నష్టం దావా వేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించారు.

ఐతే తన వ్యాఖ్యల విషయమై కొండా సురేఖలో ఇన్నాళ్లకు పశ్చాత్తాపం వచ్చింది. 2024 అక్టోబరు ఆరంభంలో సురేఖ ఆ చీప్ కామెంట్స్ చేశారు. పరువు నష్టం దావా విషయంలో నాగార్జున అస్సలు తగ్గని నేపథ్యంలో సురేఖ ఎట్టకేలకు దిగి వచ్చి క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు మంత్రి.

‘‘నాగార్జున గారికి సంబంధించి నా వ్యాఖ్యల విషయమై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఆయన, వారి కుటుంబ సభ్యుల మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశం నాకు లేదు. వారిని బాధించే, వారి పరువుకు నష్టం చేకూర్చే ఉద్దేశం కూడా నాకు లేదు. నా వ్యాఖ్యలు దురుద్దేశ భావన కలిగించి ఉంటే అందుకు చింతిస్తున్నా. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా’’ అని కొండా సురేఖ పేర్కొన్నారు.

ఐతే అలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేసిన 13 నెలలకు ఇలా స్టేట్మెంట్ ఇచ్చిన సురేఖ.. కనీసం క్షమాపణ చెప్పకుండా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మాత్రమే పేర్కొనడం పట్ల విమర్శలే వస్తున్నాయి. నాగ్, చైతూలతో పాటు సమంతకు కూడా ఆమె క్షమాపణ చెప్పాలడే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

This post was last modified on November 12, 2025 11:17 am

Share

Recent Posts

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

36 minutes ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

50 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

3 hours ago