Movie News

మంచి సినిమా… టీఎఫ్ఐ ఫెయిల్డ్?

#TFIFailedhere.. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవాళ్లకు ఈ హ్యాష్ ట్యాగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి కంటెంట్ ఉండి కూడా సరిగా ఆడని సినిమాల గురించి ప్రస్తావిస్తూ.. దీన్ని వాడుతుంటారు. ‘ఖలేజా’ సహా ఎన్నో సినిమాల విషయంలో అభిమానులు ఇలా ఫీలవుతుంటారు. దీని మీద బోలెడన్ని మీమ్స్ కూడా వస్తుంటాయి. ఐతే ఇప్పుడు ఓ కొత్త సినిమా విషయంలో ఈ హ్యాష్ ట్యాగ్ వాడాల్సిన అవసరం కనిపిస్తోందన్నది నెటిజన్ల మాట. ఆ చిత్రమే.. ది గ్రేట్ ప్రి వెడ్డింగ్ షో. 

మసూద సహా కొన్ని మంచి సినిమాల్లో నటించి మెప్పించిన తిరు వీర్ హీరోగా నటించిన సినిమా ఇది. గత వారం మరో మూడు చిత్రాలతో ఈ మూవీ పోటీ పడింది. వీకెండ్లో కంటెంట్, ఎంటర్టైన్మెంట్ పరంగా ఇదే బెస్ట్ మూవీ అనడంలో సందేహం లేదు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ కూడా విషయం ఉన్న సినిమా అయినా.. దాని కంటే ఇది బెస్ట్ ఎంటర్టైనర్ అన్నది ఈ రెండు చిత్రాలూ చూసిన వాళ్లు చెప్పిన మాట. ఈ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. 

కానీ ఈ పేరుతో ఒక సినిమా రిలీజవుతున్నట్లే జనాలకు పెద్దగా తెలియలేదు. రిలీజ్ తర్వాత కూడా పబ్లిసిటీ అనుకున్నంతగా లేకపోయింది. జనం ఆశించిన స్థాయిలో థియేటర్లకు రాలేదు. మొత్తంగా ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ విజయం సాధించిన దాఖలాలు కనిపించడం లేదు. ఉన్న కంటెంట్‌కు పెద్ద హిట్ అవ్వాల్సిన సినిమా అది. కానీ రకరకాల కారణాలు తోడై సినిమా పెద్దగా ఆడకుండానే థియేట్రికల్ రన్ ముగించేలా ఉంది. రేప్పొద్దున ఓటీటీలోకి వచ్చాక ఇలాంటి సినిమా ఎందుకు ఆడలేదో అని జనం ఆశ్చర్యపోవడం.. టీఎఫ్ఐ ఫెయిల్డ్ హియర్ అని ట్రెండ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

This post was last modified on November 11, 2025 5:22 pm

Share

Recent Posts

బలహీనపడటాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు

కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…

52 minutes ago

ఏపీలో లిక్కర్ క్వాలిటీ చెకింగ్ కు క్యూఆర్ కోడ్!

2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…

3 hours ago

అప్పుడు అనారోగ్యం గుర్తు లేదా అంబటి?

ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…

3 hours ago

తేజ సజ్జ తెలివికి ఇదే నిదర్శనం

యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…

3 hours ago

‘ఇకపై వైసీపీకి క్రిస్టియన్లు ఓటు వేయొద్దు!’

వైసీపీ అధినేత జగన్ ఏపీ సీఎంగా ఉన్న 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం విపరీతంగా జరిగేదని ఆరోపణలు…

4 hours ago

పైరసీ ఇష్యూ వల్ల కాగితానికి ప్రచారం

అక్టోబర్ 2 విడుదల కాబోతున్న సినిమాల్లో తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేస్తోంది. యూత్ ఎలిమెంట్స్ తో కోర్ట్, బ్యాండ్…

4 hours ago