Movie News

ప్రభాస్ హీరోయిన్లకు ఇది మామూలే

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌తో పని చేసిన వాళ్లందరూ అతడి గురించి సోషల్ మీడియాలో లేదా ఇంటర్వ్యూల్లో కచ్చితంగా చెప్పే విషయం ఒకటుంటుంది. అదే.. తమ ఇంటి వంటలతో అతను అందించే విందు. తాను పని చేసే యూనిట్లో దాదాపుగా ముఖ్యులందరికీ తమ ఇంటి వంటలు రుచి చూపించకుండా ఉండడు ప్రభాస్. ప్రభాస్ వల్ల తమ డైట్ ప్లాన్లు దెబ్బ తిన్నాయని.. కడుపు ఉబ్బిపోయేలా తిండి పెట్టి చంపేస్తాడని సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు కోస్టార్లు. 

ఈ జాబితాలోకి కొత్తగా ఇంకో పేరు చేరింది. ‘ఫౌజీ’ సినిమా కోసం ప్రభాస్‌తో జట్టు కట్టిన కొత్త కథానాయిక ఇమాన్వి కూడా ప్రభాస్ ఫుడ్ లవ్‌ను రుచి చూసింది. దీని మీద మాండేటరీ పోస్టు పెట్టేసింది. ‘ఫౌజీ’ షూటింగ్ టైంలో ప్రభాస్ ఇంటి నుంచి తెప్పించి వడ్డించిన నాన్ వెజ్, వెజ్ వంటకాలను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్ చేసిన ఇమాన్వి.. కడుపు పేలిపోయేలా ఈ వంటకాలను తిన్నట్లు కామెంట్ చేసింది. ఇలా ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ప్రభాస్ ఇంటి వంటకాలు తిని బాబోయ్ అన్న వాళ్లే.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన ఇమాన్వి తన వీడియోలతోనే ‘ఫౌజీ’ దర్శకుడు హను రాఘవపూడి కళ్లలో పడింది. ఇలాంటి నేపథ్యం ఉన్న కొత్త అమ్మాయిని ప్రభాస్ లాంటి టాప్ స్టార్‌కు జోడీగా తీసుకోవడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఐతే ఇమాన్వి టాలెంట్ తెలిసిన వాళ్లు.. తనేంటో ‘ఫౌజీ’ సినిమా రిలీజైనపుడు తెలుస్తుందని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 1930-40 మధ్య నేపథ్యంతో తెరకెక్కుతోంది.

This post was last modified on November 10, 2025 2:57 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

28 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago