గర్ల్ ఫ్రెండ్ తో తనలో బెస్ట్ పెరఫార్మర్ ని బయటికి తెచ్చిన రష్మిక మందన్న కెరీర్ పరంగా పీక్స్ చూస్తోంది. విజయ్ దేవరకొండతో తన బంధాన్ని ఇన్ డైరెక్ట్ బహిర్గతం చేస్తున్నప్పటికీ అధికారికంగా తమ పెళ్లి గురించి రష్మిక ఇంకా ఓపెన్ అవ్వలేదు. సరైన వేదిక, సందర్భం కోసం ఎదురు చూస్తుందేమో. పెళ్ళయాక అవకాశాలు తగ్గడం లాంటివేమీ ఉండవని ఆల్రెడీ సమంత లాంటి వాళ్ళు నిరూపించారు కాబట్టి ఆ విషయంలో ఫ్యాన్స్ నిశ్చింతగానే ఉన్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే జగపతిబాబు టాక్ షోకు గెస్టుగా వెళ్లిన రష్మీకి మందన్న అక్కడో ఆసక్తికరమైన విషయం పంచుకుంది. స్పెషల్ సాంగ్స్ తన మనసులో ఉన్న నలుగురు దర్శకులు అడిగితే మాత్రమే చేస్తుందట.
వాళ్లెవరో పేర్లు రివీల్ చేయలేదు కానీ అభిమానులు రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు. సుకుమార్ తో ఆల్రెడీ పుష్ప అయ్యింది కాబట్టి ఆయన కాకపోవచ్చు. సందీప్ వంగాతో యానిమల్ రూపంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దక్కింది కనక తను కూడా కాదేమో. రాజమౌళితో ఇప్పటిదాకా పని చేయలేదు కాబట్టి బహుశా ఫస్ట్ ఆప్షన్ కావొచ్చు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇంకా అవకాశం దక్కలేదు. బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ లాంటి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నో అనకపోవచ్చు. మొత్తానికి రష్మిక మనసులో ఎవరు ఉన్నారనేది పక్కనపెడితే ఇక్కడ చెప్పిన కాంబోస్ అయితే క్రేజీగా ఉన్నాయి.
ఇదలా ఉంచితే కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో రష్మిక మందన్న రెండు సినిమాలు రిలీజయ్యాయి. హారర్ జానర్ ట్రై చేసిన తమ్మ ఆశించిన ఫలితం ఇవ్వలేదు కానీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం బోలెడు ప్రశంసలు మోసుకొచ్చింది. కమర్షియల్ గా ఏ స్థాయి అనేది ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి ఏ సెంటర్స్ లో కలెక్షన్లు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ తెలుగులో మైసా అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ చేస్తున్న రష్మిక అది కూడా పెద్ద బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది. కెరీర్ పరంగా ఫుల్ హ్యాపీగా ఉన్న ఈ శ్రీవల్లికి వచ్చే ఏడాది వ్యక్తిగత జీవితంలో జరగబోయే శుభకార్యం ఇంకెన్ని విజయాలు తీసుకొస్తుందో.
This post was last modified on November 10, 2025 7:48 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…