Movie News

మురుగ‌దాస్ హాలీవుడ్ సినిమా?

సౌత్ ఇండియాలో కొన్నేళ్ల ముందు వ‌ర‌కు చూస్తే శంక‌ర్, రాజ‌మౌళిల త‌ర్వాత ఆ స్థాయిని అందుకున్న ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్. ర‌మ‌ణ‌, గ‌జిని, తుపాకి, క‌త్తి లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌తో అత‌ను తిరుగులేని స్థాయిని అందుకున్నాడు. కానీ క‌త్తి త‌ర్వాత అత‌ను అంచ‌నాలు అందుకోలేక‌పోయాడు. స్పైడ‌ర్‌, స‌ర్కార్, ద‌ర్బార్ లాంటి ఫెయిల్యూర్లు ఇచ్చాడు.

దీంతో మురుగ‌దాస్‌పై ఇంత‌కుముందు ఎంతో న‌మ్మ‌కమున్న విజ‌య్ సైతం అత‌డికి హ్యాండిచ్చాడు. వీళ్లిద్ద‌రి క‌ల‌యిక‌లో తుపాకి, క‌త్తి, స‌ర్కార్ చిత్రాల త‌ర్వాత మ‌రో సినిమా రావాల్సి ఉండ‌గా.. అనూహ్యంగా ఆ సినిమా నుంచి ఇటీవ‌ల మురుగ‌దాస్ త‌ప్పుకున్నాడు. స్క్రిప్టు విష‌యంలో నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ అసంతృప్తి వ్య‌క్తం చేయ‌డంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఐతే వ‌రుస ఫెయిల్యూర్ల‌కు తోడు ఇంత పెద్ద ప్రాజెక్టు నుంచి త‌ప్పుకోవ‌డం మురుగదాస్ కెరీర్‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని అంతా అనుకున్నారు. కానీ అత‌ను ఇంకా పెద్ద సినిమాను ద‌క్కించుకున్న‌ట్లు తాజా స‌మాచారం. త్వ‌ర‌లోనే మురుగ‌దాస్ ఓ హాలీవుడ్ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఫాక్స్ స్టార్ సంస్థ‌తో మురుగ‌దాస్‌కు మంచి సంబంధాలున్నాయి.

ఈ సంస్థ ఇండియా విభాగం మురుగ‌దాస్‌తో క‌లిసి సినిమాలు నిర్మించింది కూడా. ఇప్పుడా సంస్థ నిర్మాణంలోనే మురుగ‌దాస్ హాలీవుడ్ సినిమా తీయ‌నున్నాడ‌ట‌. ఇది జంగిల్ బుక్, ది బ్యూటీ అండ్ ది బీస్ట్ త‌ర‌హాలో లైవ్ యాక్ష‌న్ యానిమేటెడ్ ఫిలిం అట‌. ఇలాంటి సినిమాలు తీసిన అనుభ‌వం లేక‌పోయినప్ప‌టికీ.. దానిపై క‌స‌ర‌త్తు చేసి మురుగ‌దాస్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడ‌ట‌. మురుగ‌ను న‌మ్మి ఇలాంటి ప్రాజెక్టును ఫాక్స్ స్టార్ అత‌డికి అప్ప‌గించిందంటే విశేష‌మే.

This post was last modified on December 2, 2020 10:36 am

Share
Show comments
Published by
Satya
Tags: Murugadoos

Recent Posts

షర్మిల కామెంట్లపై బాలయ్య ఫస్ట్ రియాక్షన్

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై గతంలో సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ హైదరాబాద్ లోని ఎన్బీకే బిల్డింగ్ నుంచి…

9 hours ago

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

11 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

13 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

14 hours ago