ఒకప్పుడు బూతులు బయట మాట్లాడ్డమే మహా నేరంగా చూడటం దగ్గరి నుంచి క్రియేటివ్ ఫ్రీడమ్ పేరుతో వాటిని ఏకంగా సినిమాల్లో జనరలైజ్ చేయడం దగ్గర దాకా ఎన్నో పరిణామాలు చూస్తూనే ఉన్నాం. సెన్సార్ ఎంత మ్యూట్ చేసినా ఆర్టిస్టులు ఏం డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారో జనం ఈజీగా గుర్తు పట్టేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా లిప్ సింక్ ఎక్స్ పర్ట్ అవసరం లేదు. అడిగితే నిజ జీవితంలో ఉన్నవే పెడుతున్నామని ఫిలిం మేకర్స్ సమర్ధించుకుంటున్నారు కానీ ఇదొక కామన్ ట్రెండ్ గా మారిపోతోంది. ఈ లిస్టులో చేరుతున్న మూవీ సైక్ సిద్దార్థ డిసెంబర్ 12 విడుదల కానుంది. ఇందులో నందు హీరో.
చిన్న టీజర్ తో హీరో క్యారెక్టరైజేషన్ ని పరిచయం చేశారు. హైదరాబాద్ లో ఉండే ఓ యువకుడు నగర వాతావరణం, మనుషుల ప్రవర్తన చూసి విసుగెత్తిపోయి సైకో తరహాలో మాట్లాడుతూ ఉంటాడు. మాటకు ముందు వెనుక బూతులు లేనిదే సంభాషణ చేయలేడు. ఆర్టిసి బస్ డ్రైవర్ గురించైనా లేదా స్నేహితుడు లేదా ప్రియురాలు ఎవరైనా సరే ఇతని సంస్కృత భాషకు జడుసుకోవాల్సిందే. యూత్ ని టార్గెట్ చేయడమే ఈ కథ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆర్టిస్టుగా నందు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ కనీసం ఫామిలీతో కూర్చుని టీజర్ చూడలేనంత బూతులు పుష్కలంగా ఉన్నాయి.
వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సైక్ సిద్దార్థకు నందు హీరో మాత్రమే కాదు రచన సహకారం కూడా అందించాడు. స్మరన్ సాయి సంగీతం సమకూర్చారు. అసలు బూతులు లేకుండా యూత్ ని ఆకట్టుకోలేమా అంటే బహుశా ఇప్పటి కుర్ర డైరెక్టర్లు నో అంటారేమో. లిటిల్ హార్ట్స్ లో ఒకటి అరా పదాలు తప్ప డైలాగులన్నీ క్లీన్ గా ఉంటాయి. జాతిరత్నాలులో వెతికినా డబుల్ మీనింగ్స్ దొరకవు. మరి సైక్ సిద్దార్థ అన్ని ఎందుకు అవసరమయ్యాయో సినిమా చూశాకే క్లారిటీ వస్తుంది. అన్నట్టు దీంట్లో ఆసియన్ సురేష్ సంస్థలు భాగస్వామిగా ఉన్నాయి. క్యాస్టింగ్ లో యామిని భాస్కర్, ప్రియాంక రెబెకా తదితరులున్నారు.
This post was last modified on November 8, 2025 2:05 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…