స్టార్ క్యాస్టింగ్ లేని సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కావాలంటే కంటెంట్ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దాంతో ఎంత బాగా ఆడియన్స్ ని మెప్పించగలిగితే అంత వసూళ్లు చూడొచ్చు. బలగం నుంచి లిటిల్ హార్ట్స్ దాకా ఎన్నో సూపర్ హిట్స్ దీన్ని ఋజువు చేశాయి. వచ్చే వారం నవంబర్ 14 విడుదల కాబోతున్న సంతాన ప్రాప్తిరస్తు ఇదే క్యాటగిరీలో వచ్చే లక్ష్యంతో థియేటర్లలో అడుగు పెడుతోంది. ఏబిసిడి ఫేమ్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఎంటర్ టైనర్ ని మధుర శ్రీధర్ నిర్మించారు. ఇవాళ ట్రైలర్ ని లాంచ్ చేశారు. కథ విషయంలో అనవసరంగా ట్విస్టులను దాచకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు.
మంచి ఉద్యోగం చేసే ఓ కుర్రాడు (విక్రాంత్) ఓ అమ్మాయి(చాందిని చౌదరి) ని చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. ఆమె తండ్రి (మురళీధర్ గౌడ్) కి అంతగా ఇష్టం లేకపోయినా ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అయితే అందమైన ఈ జంటకు సంతానం కలగదు. డాక్టర్ ను వెళ్లి కలుసుకుంటే అబ్బాయిలో వీర్య కణాలు తక్కువగా ఉన్నాయని చెబుతారు. దీంతో ట్రీట్ మెంట్ కోసం మరో వైద్యుడు (వెన్నెల కిషోర్) ని సంప్రదిస్తే అతను ఖరీదయిన ఔషధాలు ఇస్తాడు. ట్రీట్ మెంట్ మొదలవుతుంది కానీ సంతాన భాగ్యం కనిపించదు. తర్వాత ఏం చేశారు, ఈ జంట ప్రయాణం ఎక్కడికి వెళ్లిందనేది తెరమీద చూడాలి.
ఇలాంటి కాన్సెప్ట్ తో తెలుగులో సినిమా రాలేదని చెప్పాలి. కొంచెం రిస్క్ అనిపించే ఇలాంటి బ్యాక్ డ్రాప్ తో ప్రేక్షకులను మెప్పించడం సవాలే. వినోదాన్ని జోడించి దర్శకుడు సంజీవ్ రెడ్డి దీన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయడం బాగుంది. విక్రాంత్, చాందిని చౌదరి జంటతో పాటు సునీల్ కశ్యప్ సంగీతం లాంటి సాంకేతిక అంశాలు ప్లస్ అయ్యేలా ఉన్నాయి. పెద్దగా పోటీ లేని టైంలో వస్తున్న సంతాన ప్రాప్తిరస్తు ట్రైలర్ తో చూపించినట్టు నవ్వులు, ఎమోషన్స్ ని బ్యాలన్స్ చేయగలిగితే హిట్టు పడ్డట్టే. హీరో హీరోయిన్, డైరెక్టర్ తో పాటు ప్రతి ఒక్కరికి ఈ మూవీ హిట్ కావడం చాలా అవసరం.
This post was last modified on November 6, 2025 6:11 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…