వరుస ఫ్లాపుల నుంచి బయటపడి ‘భీష్మ’తో ఓ మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు నితిన్. అతడితో ప్రాజెక్టులు సెట్ చేసుకున్న వాళ్లందరికీ ఇది ఊరటనిచ్చే విషయమే. ప్రస్తుతం అతను సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో వెంకీ అట్లూరి డైరెక్షన్లో ‘రంగ్ దె’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు చంద్రశేఖర్ యేలేటి సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది.
లాక్ డౌన్ లేకపోతే ఈ రెండు సినిమాలు దాదాపు పూర్తయ్యేవే. ఇవి పూర్తి చేశాక ఇంకో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి నితిన్ కోసం. అందులో ఒకటి ‘అంధాదున్’ రీమేక్ కాగా.. ఇంకోటి నితిన్ కెరీర్లోనే అతి పెద్ద సినిమా అనదగ్గ ‘పవర్ పేట’.
తనతో ‘చల్ మోహన్ రంగ’ తీసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ చేయబోయే యాక్షన్ డ్రామా ఇది. నితిన్ సంస్థ ‘శ్రేష్ఠ్ మూవీస్’, ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’ ఉమ్మడిగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి.
ఇది రెండు పార్టులుగా రాబోయే సినిమా. నితిన్ కెరీర్లో తొలిసారిగా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడు. దీని బడ్జెట్, కాస్టింగ్ అన్నింట్లోనూ భారీతనం ఉంటుందంటున్నారు. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘వడ చెన్నై’ తరహాలో ఆంధ్రాలోని పవర్ పేట ప్రాంతంలో రౌడీయిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందట. ఈ సినిమాకు కాస్టింగ్ అంతా కూడా సెట్ అయిపోయింది.
కీర్తి సురేష్ కథానాయికగా ఖరారవగా.. సత్యదేవ్ ఓ కీలక పాత్ర చేయనున్నాడు. సినిమాలో మరో బలమైన పాత్రకు రావు రమేష్‌ను ఎంచుకున్నాడు కృష్ణచైతన్య. దర్శకుడిగా అతడి తొలి సినిమా ‘రౌడీ ఫెలో’లో రావు రమేష్ విలన్ క్యారెక్టర్ ఎంత బాగా పేలిందో తెలిసిందే. ‘చల్ మోహన్ రంగ’లోనూ ఓ క్యారెక్టర్ చేశాడాయన. ఇప్పుడు వరుసగా మూడో సినిమాలోనూ రావు రమేష్‌కు కీలక పాత్ర ఇచ్చాడు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. వచ్చే ఏడాది ‘పవర్ పేట’ ఫస్ట్ పార్ట్ పట్టాలెక్కనుంది.
This post was last modified on May 2, 2020 7:13 pm
సంక్రాంతి పండక్కు అందరికంటే ముందు వస్తున్న ఆనందం, అడ్వాంటేజ్ రెండూ గేమ్ ఛేంజర్ కు అనుకూలంగా ఉంటాయి. టాక్ పాజిటివ్…
టాలీవుడ్లో సమస్యలు ఎదురైనప్పుడు.. వాటిని పరిష్కరించే వ్యూహాలు.. చతురత ఉన్న ప్రముఖుల కోసం.. ఇప్పుడు నటులు, నిర్మాతలు ఎదురు చూసే…
ఐఏఎస్ అధికారి.. శ్రీలక్ష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా తెలుసు. దీనికి కారణం .. దేశంలోనే…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మరో బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. వారికి ఇప్పటికే.. సరైన సముచిత ప్రాధాన్యం కల్పించిన…
‘పవర్’ లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన బాబీ.. ఆ తర్వాత ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో ఎదురు దెబ్బ…