Movie News

దుమారం రేపిన కామెంట్లపై బండ్ల వివరణ

బండ్ల గణేష్.. గత కొన్ని వారాల్లో టాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశం అయిన పేరు ఇదే. ముందుగా లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో హీరో మౌళిని కొనియాడుతూ ఇండస్ట్రీలో మాఫియా ఉందంటూ కామెంట్ చేశాడు. అంతే కాక అల్లు అరవింద్ మీద పంచ్‌లు వేయడమే కాక.. మహేష్ బాబు, విజయ్ దేవరకొండల గురించి కూడా చిన్న నెగెటివ్ కామెంట్ చేశాడు బండ్ల. దీని మీద పెద్ద దుమారమే రేగింది.

ఇది కాస్త సద్దుమణిగే లోపే తాజాగా విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ ‘కే ర్యాంప్’ సక్సెస్ మీట్లో తీవ్ర వ్యాఖ్యలే చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు. కొందరు ఒక హిట్టు పడగానే లూజు లూజు ప్యాంట్లేసుకుని.. కళ్ళజోడు, టోపీ పెట్టుకుని..‘వాట్సాప్ వాట్సాప్’ అంటూ స్టేజిమీద రెచ్చిపోయి తిరుగుతుంటారు.. అంటూ బండ్ల చేసిన కామెంట్ దుమారం రేపింది. పేరు పెట్టకపోయినా ఈ కామెంట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించే అని అందరికీ అర్థం అయిపోయింది. విజయ్ ఫ్యాన్స్ బండ్లను టార్గెట్ చేశారు.

కష్టపడి సొంతంగా హీరోగా ఎదిగిన విజయ్ మీద ఈ కామెంట్స్ ఏంటని.. ఒక పెద్ద ఫ్యామిలీ హీరో మీద ఇలా మాట్లాడగలరా అని బండ్ల తీరును దుయ్యబట్టారు. తన కామెంట్స్ బాగా నెగెటివిటీ తెచ్చి పెట్టడంతో బండ్ల రెండు రోజుల గ్యాప్ తర్వాత రెస్పాండ్ అయ్యాడు. “ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే” అని తన ఎక్స్ హ్యాండిల్లో పెట్టిన పోస్టులో బండ్ల గణేష్ పేర్కొన్నాడు.

ఈ పోస్ట్ చూశాక అడుసు తొక్కనేల, కాలు కడగనేల అనే సామెత గుర్తుకు వస్తోంది. బండ్ల ఇలా వరుసగా వివాదాస్పద కామెంట్స్ చేస్తుండడంతో ఇకపై ఇండస్ట్రీలో ఎవరైనా ఏదైనా ఈవెంట్ కి ఆయన్ని పిలవాలంటే సంకోచించే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే బండ్ల నిన్ననే ఇలాంటి క్లారిఫికేషన్ పోస్టు ఇంకోటి పెట్టాడు. తాను చిరంజీవితో సినిమా తీయబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించాడు.

This post was last modified on November 5, 2025 5:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

37 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

48 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

2 hours ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

2 hours ago