Movie News

గర్ల్ ఫ్రెండ్ మీద ఇంత కాన్ఫిడెన్సా

ఎల్లుండి విడుదల కాబోతున్న ది గర్ల్ ఫ్రెండ్ మీద టీమ్ మాములు నమ్మకంగా లేదు. ఇవాళ నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో యూనిట్ సభ్యుల మాటలు వింటే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయేలా ఉన్నాయి. అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా చూశాక చాలా మంది రాత్రి నిద్రపోరని, గతంలో తమ చిత్రాలకు 1.5 నుంచి 3.5 దాకా రేటింగ్స్ ఇచ్చినవాళ్లు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ కి తక్కువ ఇవ్వాలంటే ఆలోచిస్తారని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని సైతం చాలా కాన్ఫిడెన్స్ చూపించారు. ఇది హిట్ అయితే దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కు ఏకంగా హైదరాబాద్ లో ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చేశారు.

ఇలా ఒక్కొక్కరు తమ అనుభవాలు, జ్ఞాపకాలు, పడ్డ కష్టాలు అన్నీ పంచుకున్నారు. నిజానికి ఈ మూవీ మీద ఏమైనా బజ్ ఉందంటే రష్మిక మందన్ననే ప్రధాన కారణం. ట్రైలర్ కట్ చేసిన విధానం యూత్ లో అంచనాలు రేపింది. కథ పూర్తిగా రివీల్ చేయకకపోయినా ఏదో టిపికల్ బ్యాక్ డ్రాప్ తీసుకున్న వైనం కనిపించింది. ఆడియన్స్ షాక్ అవుతారని, దీని గురించే ఆలోచించే స్థాయిలో రాహుల్ రవీంద్రన్ సినిమాని తెరకెక్కించారని పని చేసినవాళ్లు ఓ రేంజ్ లో ఊరిస్తున్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన దాంట్లో సగం ఉన్నా చాలు బాక్సాఫీస్ వద్ద ది గర్ల్ ఫ్రెండ్ దూసుకుపోవడం ఖాయం.

పేరుకు పోటీగా అరడజను సినిమాలు ఉన్నప్పటికీ ఎక్కువ ఎడ్జ్ తీసుకుంటున్నది గర్ల్ ఫ్రెండ్ మాత్రమే. తర్వాత  సుధీర్ బాబు జటాధర ఉంది కానీ అది కూడా బజ్ కోసం పోరాడుతున్నదే. రష్మిక మందన్నకు ఇటీవలే తమ్మ రూపంలో చేదు ఫలితం ఎదురయ్యింది. రిస్క్ తీసుకుని మరీ హారర్ జానర్ ట్రై చేస్తే ఆడియన్స్ ఆదరించలేదు. హిందీలో ఏదో కాస్త నెట్టుకొచ్చింది కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తో సాలిడ్ కంబ్యాక్ కావాలని ఎదురు చూస్తోంది. విజయ్ దేవరకొండతో ఎంగేజ్ మెంట్ అయ్యాక విడుదలవుతున్న తెలుగు సినిమాగా కూడా గర్ల్ ఫ్రెండ్ తనకో స్పెషల్ మెమరీ కానుంది.

This post was last modified on November 5, 2025 7:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎన్నో ట్విస్టులతో… డ్రీమ్ లవ్ స్టోరీకి బ్రేకప్

క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆశగా ఎదురుచూసిన పెళ్లి ఆగిపోయింది. ఒక సినిమాను మించిన మలుపులతో సాగిన స్మృతి మంధాన,…

3 hours ago

లేటు వయసులో అదరగొడుతున్న అక్షయ్

మొన్నటి తరం లెజెండరీ హీరో వినోద్ ఖన్నా వారసుడిగా 1997లో బాలీవుడ్ కు వచ్చాడు అక్షయ్ ఖన్నా. కెరీర్ ప్రారంభంలో…

4 hours ago

కోహ్లీ 100 సెంచరీలు: సచిన్ రికార్డు సాధ్యమేనా?

సౌతాఫ్రికా సిరీస్‌లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాం. పది నెలల తర్వాత సొంతగడ్డపై ఆడుతూ పరుగుల వరద పారించాడు. మూడు…

5 hours ago

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే…

6 hours ago

కొత్త ప్రభాస్‌… వంగ టచ్ కనిపిస్తోంది

‘బాహుబలి’ కోసం ఐదేళ్ల పాటు ప్రభాస్ ఎంత కష్టపడ్డాడో.. రెండు పార్ట్స్‌లో ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడో తెలిసిందే. కానీ అంత…

6 hours ago

అమెరికాలో లోకేష్ ను ఆపిన పోలీసులు…

తన జీవితంలో జరగని సంఘటన ఇప్పుడు జరిగిందంటూ ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.…

6 hours ago