అన్నం ఉడికిందో లేదో తెలియడానికి చిన్న మెతుకు చాలన్నట్టు కొన్నిసార్లు పాటలు ఎలా ఉండబోతున్నాయో చెప్పేందుకు చిన్న బిట్ చాలు. పెద్ది అనౌన్స్ మెంట్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఎంత ఆనందపడ్డారో ఫామ్ తగ్గిపోయిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అనగానే అంతే టెన్షన్ పడ్డారు. ఎందుకంటే తమిళంలో అదిరిపోయే ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఇచ్చిన రెహమాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ఆ స్థాయి కంటెంట్ ఇవ్వలేకపోయారు. అందుకే పెద్ది విషయంలో కొంత ఆందోళన రేగింది. ఇవాళ దర్శకుడు బుచ్చిబాబు తనదైన స్టయిల్ లో చికిరి చికిరి డేట్ ప్రకటనతో దాన్ని తగ్గించేశారు.
రెహమాన్ తో సరదాగా సంభాషణ మొదలుపెట్టి తనకు కావాల్సిన సిచువేషన్ ని వివరించి చికిరి చికిరి పదంతోనే పాట కంపోజ్ చేయమని చెప్పడం కొత్తగా అనిపించింది. ఇలా ఎవరూ చేయలేదని కాదు కానీ రెహమాన్ పాల్గొనడం మాత్రం మొదటిసారని చెప్పొచ్చు. వీడియో చివర్లో రామ్ చరణ్ మంచి గ్రేస్ తో వేసిన డిఫరెంట్ స్టెప్ అభిమానులు రిపీట్ గా చూసేలా ఉంది. రెహమాన్ క్యాచీగా ట్యూన్ కంపోజ్ చేసిన విధానం, మోహిత్ చౌహాన్ గాత్రం కొత్తగా ఉన్నాయి. నవంబర్ 7 విడుదల కాబోయే ఫుల్ సాంగ్ విన్నాక మరింత క్లారిటీ వస్తుంది కానీ మొత్తానికి ఎదురు చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యింది.
మార్చి 27 విడుదల కాబోతున్న పెద్ది కోసం బుచ్చిబాబు చేసుకుంటున్న ప్రమోషన్లు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఫస్ట్ షాట్ ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒక్క నిమిషం వీడియోతో బిజినెస్ ఆఫర్లు రెట్టింపు అయ్యేలా రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పాటలతో కొత్త హడావిడి మొదలుపెట్టబోతున్నారు. ఏది ఏమైనా రెహమాన్ మీద మునుపటి నమ్మకం వచ్చేలా చేస్తే చాలనేది మ్యూజిక్ లవర్స్ కోరిక. ఆయన్ను విపరీతంగా అభిమానించే బుచ్చిబాబు ఖచ్చితంగా అంత అవుట్ ఫుట్ రాబట్టుకుంటాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. దానికి ఫస్ట్ షాట్, చికిరి చికిరి గట్టి పునాది వేశాయి.
This post was last modified on November 5, 2025 1:21 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…