ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల థియేటర్లు బోసిపోతున్నాయి. కొత్త రిలీజ్ మాస్ జాతర ఫలితం తేలిపోవడంతో వీక్ డేస్ ఆక్యుపెన్సీలు అంతంత మాత్రమే ఉన్నాయి. మొదటి ఆదివారమే హౌస్ ఫుల్స్ చేయలేకపోయిన రవితేజ ఇక అద్భుతాలు చేసే ఛాన్స్ ఏ మాత్రం లేనట్టే. బాహుబలి ది ఎపిక్ వారాంతంలోపే ఎంత రాబట్టాలో అంతా లాగేసింది. హైదరాబాద్ లో ఉన్న కొన్ని క్రేజీ మల్టీప్లెక్సుల్లో తప్ప మిగిలిన చోట్ల పెద్దగా బుకింగ్స్ లేవు. బిసి సెంటర్స్ లో ఫైనల్ రన్ కు వచ్చేసిందని ట్రేడ్ టాక్. వంద కోట్ల రేంజ్ లో ఫ్యాన్స్ ఊహించుకున్నారు కానీ నెరవేరలేదు. అయినా సరే రీ రిలీజ్ రికార్డులు ఎపిక్ పేరు మీద ఉండబోతున్నాయి.
ఇదిలా ఉండగా ఎల్లుండి నవంబర్ 7 వస్తున్న అరడజను సినిమాల్లో ఏది థియేటర్లను నింపుతుందనే ఆసక్తి బయ్యర్ వర్గాల్లో ఉంది. రష్మిక మందన్న ఇమేజ్ మీదే మార్కెటింగ్ చేస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మీద యూత్ లో మంచి ఆసక్తే నెలకొంది. ఏదో డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నారు కాబట్టి అది కనక కనెక్ట్ అయితే జనాలు ఖచ్చితంగా వస్తారు. సుధీర్ బాబు ‘జటాధర’ మీద చాలా ఖర్చు పెట్టారు. ఓపెనింగ్స్ తెచ్చేంత బజ్ ప్రస్తుతానికి లేకపోయినా మౌత్ టాక్, రివ్యూల మీద టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఫాంటసీ జానర్ కావడంతో మిరాయ్ తరహాలో బాక్సాఫీస్ సర్ప్రైజ్ ఇస్తుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
తిరువీర్ నటించిన ‘ది గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో’ జనంలో బజ్ కోసం పోరాడుతోంది. ఇది కూడా టాక్ మీద ఆధారపడాల్సిందే. తమిళ డబ్బింగ్ ‘ఆర్యన్’ ఒరిజినల్ వెర్షన్ కన్నా వారం ఆలస్యంగా తెస్తున్నారు. అక్కడ రెస్పాన్స్ యావరేజ్ కావడంతో ఇక్కడ ఎలా ఆడుతుందనేది వేచి చూడాలి. హీరో విష్ణు విశాల్ హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు చూసుకుంటున్నాడు. ఇవి కాకుండా ప్రేమిస్తున్నా, కృష్ణ లీల అనే చిన్న సినిమాలు కూడా రేస్ లో ఉన్నాయి. బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ ‘హాక్’ బరిలో ఉంది. డ్రైగా ఉన్న బాక్సాఫీస్ కు ఏవి ఉత్సాహాన్ని ఇస్తాయో ఏవి నిరాశకు గురి చేస్తాయో ఇంకో నలభై ఎనిమిది గంటల్లో తేలనుంది.
This post was last modified on November 5, 2025 11:02 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…