Movie News

ఎట్టకేలకు స్పందించిన బండ్ల గణేష్

చాలా ఏళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. గ‌త నెల రోజుల్లో ప‌లుమార్లు ఆయ‌న పేరు హాట్ టాపిక్‌గా మారింది. లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్లో చేసిన ప్ర‌సంగం వివాదాస్ప‌దం కాగా.. దీపావ‌ళికి త‌న ఇంట్లో సినీ ప్ర‌ముఖుల‌కు ఇచ్చిన భారీ పార్టీ సైతం చ‌ర్చ‌నీయాంశం అయింది. లేటెస్ట్‌గా కే ర్యాంప్ స‌క్సెస్ మీట్లో విజ‌య్ దేవ‌ర‌కొండ పేరెత్త‌కుండా త‌న‌ను ఉద్దేశించి కౌంట‌ర్లు వేయ‌డం గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియాను ఊపేస్తోంది. 

ఇంత‌లోనే బండ్ల నిర్మాత‌గా బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇస్తున్నాడ‌ని.. మెగాస్టార్ చిరంజీవితో వ‌రుస‌గా సినిమాలు తీయ‌బోతున్నాడ‌ని ఒక హాట్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. త‌న ఇంట్లో దీపావ‌ళి పార్టీకి చిరును గౌర‌వించ‌డం వెనుక కూడా ఇదే కార‌ణ‌మ‌ని కూడా ఓ ప్ర‌చారం న‌డుస్తోంది. ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డంతో బండ్ల స్పందించాడు. అంద‌రికీ క్లారిటీ ఇస్తూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టాడు.

మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం:ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను అని ఆ పోస్టులో పేర్కొన్నాడు బండ్ల‌. బండ్ల గ‌త నెల రోజులుగా బాగా యాక్టివ్ కావ‌డం, దీపావ‌ళికి పెద్ద పార్టీ ఇవ్వ‌డం చూసి క‌చ్చితంగా రీఎంట్రీకి ప్లాన్ చేసుకుంటున్నాడ‌నే అంతా అనుకున్నారు. 

ఒక‌ప్పుడు క‌మెడియ‌న్‌గా చిన్న చిన్న పాత్ర‌లు వేసిన బండ్ల‌.. త‌ర్వాత నిర్మాత అవ‌తారం ఎత్తి ఆంజ‌నేయులు, తీన్ మార్, గ‌బ్బ‌ర్ సింగ్, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, బాద్‌షా, టెంప‌ర్ లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీశాడు. చివ‌ర‌గా టెంప‌ర్‌తో పెద్ద హిట్ కొట్టిన‌ప్ప‌టికీ.. త‌ర్వాత ప్రొడ‌క్ష‌న్‌కు దూరం అయిపోయాడు. మ‌ళ్లీ నిర్మాత‌గా సినిమాలు తీస్తాడ‌ని, త‌న కొడుకుల‌ను హీరోలుగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు రాగా.. అలాంటిదేమీ లేద‌న్న‌ట్లు గ‌ణేష్ క్లారిటీ ఇవ్వ‌డం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

This post was last modified on November 4, 2025 8:50 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago