కన్నడ అమ్మాయి రష్మిక మందన్నా తెలుగింటి కోడలు కాబోతోందన్న విషయం బహిరంగ రహస్యమే. కొన్ని వారాల కిందటే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఐతే కారణమేంటో గానీ.. ఆ విషయాన్ని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇటు విజయ్, అటు రష్మిక ఇద్దరూ తమ వేళ్లకు ఉంగరాలు ధరించి ఉండడంతో అభిమానులకు విషయం అర్థమైపోయింది.
కానీ నిశ్చితార్థం గురించి ఎప్పుడు అధికారికంగా చెబుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇద్దరూ మౌనం వహిస్తున్నారు. ఐతే తన కొత్త చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషన్లలో భాగంగా జగపతి బాబు నిర్వహించే ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోకు అతిథిగా వచ్చిన రష్మిక తన వేలికి ఉన్న ఉంగరం గురించి మాట్లాడింది. కానీ నిశ్చితార్థం గురించి మాత్రం ఓపెన్ కాలేదు.
ఈ షోలో భాగంగా జగపతిబాబు రష్మికను ఆసక్తికర ప్రశ్నలు వేశారు. విజయ్ దేవరకొండ, విజయ్ సేతుపతి, దళపతి విజయ్.. ఇలా విజయ్‌లందరితోనూ సినిమాలు చేస్తున్నావు, విజయాలు సొంతం చేసుకుంటున్నావు.. విజయ్ అనే పేరుతో నీకు ప్రత్యేకమైన కనెక్షన్ ఉన్నట్లుందే అంటే రష్మిక సిగ్గుపడింది.
ఇక వేలికి ఉన్న రెండు ఉంగరాల గురించి ప్రస్తావించగా.. అవి రెండూ చాలా ఇంపార్టెంట్ అని ఆమె బదులిచ్చింది. ఆ రెండు ఉంగరాల్లో ఒకటి చాలా స్పెషల్ అట కదా.. దానికో పెద్ద హిస్టరీ ఉందట కదా అంటే రష్మిక సిగ్గుపడిపోయింది. ఆ సమయంలో ఆడియన్స్ గట్టిగా అరవగా.. వాళ్ల గోలేంటో చూడమని అన్నారు జగపతి. మరి దానికి రష్మిక ఏమందో షో మొత్తం చూడాల్సిందే.
This post was last modified on November 3, 2025 10:55 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…