సినిమాల ప్రమోషన్‌ను కొత్త పుంతలు తొక్కించే క్రమంలో కొంచెం భిన్నంగా ఏదైనా చేయాలని చూస్తుంటాయి చిత్ర బృందాలు. ప్రమోషనల్ సాంగ్స్ చేసి రిలీజ్ చేయడం ఇందులో భాగమే. ఆ పాటలు సినిమాలో కూడా ఉండవు. కేవలం ప్రమోషన్లకే పరిమితం అవుతుంటాయి. ఇలాంటి పాటల్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చుతోనే తీయాలని చూస్తారు.
కానీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే చిన్న సినిమా కోసం చేసిన ప్రమోషనల్ సాంగ్ ఏకంగా కోటి రూపాయలు ఖర్చు పెట్టేసిందట టీం. కొన్ని నెలల కిందటే సినిమా నుంచి ‘నదివే’ అంటూ సాగే ఒక ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు చాలా ఎక్కువ ఖర్చు పెట్టేశామంటూ నిర్మాత ధీరజ్ మొగిలినేని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దానికి అంత బడ్జెట్ అవుతుందని ఊహించలేదని.. కానీ కమిటయ్యాం కనుక ఆ పాట చేయాల్సి వచ్చిందని ధీరజ్ తెలిపాడు.
ఈ సినిమా నుంచి తొలి పాట రిలీజ్ చేద్దాం అనుకున్నపుడు.. రొటీన్‌గా ఎందుకు చేయాలని ఆలోచించామన్నాడు ధీరజ్. లిరికల్ వీడియో అంటూ అందరూ ఒకేలా చేస్తారని.. అలా కాకుండా భిన్నంగా ఏదైనా చేద్దాం అని ఆలోచించి ప్రమోషనల్ సాంగ్ చేద్దాం.. దాన్ని షూట్ చేసి రిలీజ్ చేద్దాం అని తనే దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు ఐడియా ఇచ్చినట్లు ధీరజ్ తెలిపాడు.
కాన్సెప్ట్ అనుకున్నాక దానికి ఏర్పాట్లు జరిగాయని.. షూట్‌కు రెండు రోజుల ముందు దాని కోసం ప్రొడక్షన్ టీం బడ్జెట్ వేసి చూపించిందని.. అది చూసి తాను షాకయ్యానని ధీరజ్ తెలిపాడు. ఏకంగా కోటి రూపాయలు ఆ పాట కోసం ఖర్చు చేశామని.. తీరా చూస్తే ఆ పాట సినిమాలో ఉండదని.. ప్రమోషన్లకే పరిమితమవుతుందని అతను చెప్పాడు. కానీ చేయాలి అనుకున్నాం కాబట్టి ఆ పాట పూర్తి చేశామని ధీరజ్ తెలిపాడు. రష్మిక, ధీరజ్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on November 1, 2025 4:47 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…