దర్శకులతో సత్సంబంధాలు కొనసాగించే మహేష్ బాబుకి ఆమధ్య కొందరు దర్శకులతో పొరపొచ్చాలొచ్చాయి. త్రివిక్రమ్, పూరి జగన్నాధ్, సుకుమార్ లాంటి దర్శకులతో అభిప్రాయబేధాలు రావడంతో వారితో మరో చిత్రం చేయడానికి మహేష్ ఆసక్తి చూపించలేదు. కానీ ఈ కరోనా లాక్‍డౌన్‍లో మహేష్ అలా దూరమైన వాళ్లందరినీ తిరిగి దగ్గర చేసుకున్నాడు. ఆల్రెడీ త్రివిక్రమ్‍తో త్వరలోనే ఒక సినిమా వుంటుందని అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్ ఎప్పుడంటే అప్పుడు సినిమా చేయడానికి మహేష్ సిద్ధంగా వున్నాడు.
అలాగే పూరి జగన్నాధ్‍కి కూడా మహేష్ అభయం ఇచ్చినట్టు టాక్. తనకు నచ్చే కథ తీసుకుని వస్తే జగన్‍కి డేట్స్ ఇస్తానని మహేష్ చెప్పాడట. తాజాగా సుకుమార్‍తో కూడా మహేష్‍కి వున్న డిఫరెన్సెస్ తొలగిపోయాయని, ఈసారి మంచి కథ తీసుకుని రమ్మని సుక్కూకి చెప్పాడని వార్తలొస్తున్నాయి. పుష్ప కథను మహేష్ కోసమే సుకుమార్ రెడీ చేసాడు. అయితే మహేష్ ఆ కథలో మార్పులు చెప్పి ఆలోగా అనిల్ రావిపూడితో సినిమా అనౌన్స్ చేయడం సుకుమార్‍కి నచ్చలేదు. దాంతో ఇక అతడితో మళ్లీ పని చేయననే అర్థం వచ్చేలా మహేష్ ట్వీట్ పెట్టాడు. కానీ ఇప్పుడు వారిమధ్య వున్న దూరం తొలగిపోయిందట. త్వరలోనే ఈ కాంబినేషన్‍లో సినిమా వస్తుందట.
This post was last modified on November 30, 2020 8:56 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…