ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగులో మల్టీస్టారర్లు పెరుగుతాయనుకుంటే దానికి భిన్నంగా అంత స్పీడ్ అయితే కనిపించలేదు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను రాజమౌళి అంతటి దిగ్గజం కాకుండా వేరొకరు అయితే బ్యాలన్స్ చేయలేరని భావించేమో ఎవరూ పెద్దగా రిస్క్ చేయలేదు. వాల్తేరు వీరయ్య లాంటి ఒకటి రెండు సినిమాలు వచ్చాయి కాని అధిక శాతం స్టార్లు సోలో సబ్జెక్టులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటరెస్టింగ్ కాంబోకి శ్రీకారం చుట్టబోతున్నట్టు ఫిలిం నగర్ టాక్. మాస్ మహారాజా రవితేజ, యూత్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి కలయికలో ఒక క్రేజీ ఎంటర్ టైనర్ కి త్వరలోనే పునాది పడొచ్చని ఇన్ సైడ్ న్యూస్.
ప్రముఖ రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఇటీవలే ఈ ఇద్దరికీ నెరేషన్ ఇస్తే సింగల్ సిట్టింగ్ లోనే పాజిటివ్ సిగ్నల్ వచ్చినట్టు తెలిసింది. అయితే దర్శకుడు ఎవరనేది లాక్ కాలేదు. ఈ కాంబో మీద పెట్టుబడి అంటే టాప్ ప్రొడక్షన్ హౌసులే లైన్ లో ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు కానీ ముందైతే డైరెక్టర్ ని లాక్ చేసుకోవాలి. ప్రసన్న కుమార్ కు మొదటి నుంచి డైరెక్షన్ మీద మనసుంది. నా సామిరంగా తనే చేయాల్సింది కానీ చివరి నిమిషంలో వదులుకుని కేవలం స్క్రిప్ట్ మాత్రం ఇచ్చాడు. మరి ఇప్పుడు రవితేజ, నవీన్ కనక అంగీకారం తెలిపితే బహుశా ఇదే తన డైరెక్షన్ డెబ్యూ కావొచ్చు లేదా వేరొకరికి ఇవ్వొచ్చు.
ప్రస్తుతానికిది ఇంకా అనౌన్స్ మెంట్ స్టేజికి రాలేదు. ప్రాధమికంగా ఓకే అనుకున్నారు కానీ ఫైనల్ వెర్షన్ లాక్ అయితే తప్ప పూర్తి వివరాలు బయటికి రావు. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, ఇడియట్ చంటిగాడు కలిస్తే తెరమీద జరగబోయే అల్లరి మాములుగా ఉండదు. కాకపోతే వీళ్ళ ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునే టీమ్ కావాలి. రైటర్ గా మజాకాతో నిరాశ చెందిన ప్రసన్న కుమార్ ఈసారి రూటు మార్చి మంచి ఎంటర్ టైనర్ రాసుకున్నాడట. మాములుగా ఏదైనా కథని అంత సులభంగా ఒప్పుకోని నవీన్ పోలిశెట్టికి అంత ఫాస్ట్ గా నచ్చిందంటే విషయం పెద్దదే అయ్యుంటుంది. చూడాలి మరి ఎప్పుడు ఓకే అవుతుందో.
This post was last modified on October 28, 2025 3:39 pm
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…
తల్లిదండ్రులపై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వరకు ఉండాల్సిందే. కానీ, జ్యాతస్యహి ధ్రువో మృత్యు.. అన్నట్టుగా కాలం…
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…