Movie News

ఆంజనేయుడు మాస్ హీరో అయితే

మన పురాణ పాత్రల్లో ఆంజనేయుడు అత్యంత వినోదాన్నిచ్చే క్యారెక్టర్లలో ఒకటి. ఆ పాత్రను సరిగా ఉపయోగించుకుంటే ప్రేక్షకులను ఎంత ఎంటర్టైన్ చేయొచ్చో.. బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద విజయం సాధించవచ్చో ‘హనుమాన్’ మూవీ రుజువు చేసింది. అందులో హనుమంతుడి పాత్ర మీద తక్కువ సన్నివేశాలే ఉన్నప్పటికీ.. అవి గూస్ బంప్స్ ఇచ్చాయి. 

ఇప్పుడు తెలుగులో హనుమంతుడి మీదే పూర్తి స్థాయి సినిమా ఒకటి రాబోతోంది. ఐతే అది రెగ్యులర్ ఫీచర్ ఫిలిం కాదు. యానిమేషన్. ఇటీవలే ‘మహావతార నరసింహ’ ఇండియన్ యానిమేషన్ సినిమాల రికార్డులన్నీ బద్దలు కొట్టి ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో దాని స్ఫూర్తితో తెలుగులో ‘వాయుపుత్ర’ చేయబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో చందు మొండేటి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా గురించి నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

‘‘ప్రపంచంలోనే ఆంజనేయ స్వామి అంత బలవంతుడు ఇంకొకరు లేరంటారు కదా. అలాంటి బలవంతుడిని మాస్ హీరోగా చూపిస్తే ఎలా ఉంటుందో అలా కమర్షియల్ సినిమాల స్టయిల్లో చూపించబోతున్నాం. మీకు ప్రభాస్‌ను సలార్‌లో చూస్తే ఒక మాస్ హై ఎలా వస్తుందో.. అలా ఆంజనేయ స్వామిని చూస్తే హై వచ్చేలా చందు అన్ని సీక్వెన్సెస్ డిజైన్ చేశాడు. 

సంక్రాంతికి ఒక టీజర్ ట్రై చేస్తున్నాం. ఆ టీజర్ చూసినపుడే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక మాస్ హీరోను చూసినట్లు ఫీలవుతారు ఆంజనేయస్వామిని చూస్తే. అలా కొత్తరకంగా యానిమేషన్ ట్రై చేస్తున్నాం’’ అని నాగవంశీ ‘వాయుపుత్ర’ గురించి ఇంట్రో ఇచ్చాడు. ఈ మాటల్ని బట్టి చూస్తుంటే ‘వాయుపుత్ర’ను భారీ సినిమాగానే తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నట్లుంది. మరి నాగవంశీ చెబుతున్న రేంజిలో టీజర్ ఉంటుందో లేదో సంక్రాంతికి తెలుసుకుందాం.

This post was last modified on October 27, 2025 6:26 pm

Share

Recent Posts

లెజెండరీ నటుడు నానా పటేకర్ కన్నుమూత!

ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…

12 minutes ago

‘రణబాలి’ నేర్చుకున్న ‘ప్యారడైజ్’ పాఠం

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…

49 minutes ago

ఖైదీకి గోల్డ్ మెడల్.. జైల్లోనే చదివి డిగ్రీలో టాప్‌!

కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…

2 hours ago

చీరలో పరిగెత్తి చరిత్ర సృష్టించిన కవిత

జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…

2 hours ago

ఈసారి అంత ఈజీ కాదు శ్రీకాంత్

మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…

7 hours ago

కరెంటు లేని కాలం కావాలంటున్న డైరెక్టర్

ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…

8 hours ago