ఇంకో డెబ్భై రోజుల్లో 2026 సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి మొత్తం ఏడు సినిమాలు బరిలో ఉండే అవకాశాలు స్పష్టం కావడంతో థియేటర్ల సర్దుబాటు గురించి ఆల్రెడీ బయ్యర్ వర్గాల్లో టెన్షన్ మొదలైపోయింది. ఏడాది మొత్తంలో అతి పెద్ద రెవిన్యూ సీజన్ గా భావించే ఈ పండక్కు ఎంత పెద్ద హీరోల క్లాష్ ఉన్నా సరే యావరేజ్ కంటెంట్ తోనూ సూపర్ హిట్ వసూళ్లు కొల్లగొట్టొచ్చు. బ్లాక్ బస్టర్ కంటెంట్ పడితే మాత్రం కలెక్షన్ల సునామి ఉంటుంది. అయితే ఈసారి పోటీ మరీ తీవ్రంగా మారిపోవడం బిసి సెంటర్ల ఎగ్జిబిటర్లను తలలు పట్టుకునేలా చేస్తోంది. అదెలాగో మీరే చూడండి.
జనవరి 9 ప్రభాస్ ‘ది రాజా సాబ్’ దిగుతాడు. పాజిటివ్ టాక్ వచ్చిందా డార్లింగ్ చేయబోయే విధ్వంసం మాములుగా ఉండదు. అసలే మంచి వింటేజ్ వైబ్స్ తో ప్రమోషన్లు పీక్స్ కు చేరుకోబోతున్నాయి మూడు రోజులు ఆగి 12న చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ని తెస్తారని ఫిలిం నగర్ న్యూస్. ఆల్రెడీ ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు లాకైపోయారు. అడ్వాన్సులు కూడా ఇచ్చేశారట. థియేటర్ అగ్రిమెంట్లు ఏ క్షణమైనా మొదలవ్వొచ్చు. మరుసటి రోజు రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, 14న నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, చివరిలో శర్వానంద్ ‘నారీనారీ నడుమ మురారి’ని దించే ప్లానింగ్ లో నిర్మాతలున్నారు.
ఇవి చాలవన్నట్టు విజయ్ ‘జన నాయకుడు’ ఒకే రోజు రాజా సాబ్ తో క్లాష్ కానుండగా శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ని పొంగల్ బరిలో దింపే లక్ష్యంతో పనులు వేగవంతం చేస్తున్నారని చెన్నై టాక్. ప్రాక్టికల్ గా చూస్తే ఇంత పెద్ద క్లాష్ టాలీవుడ్ బాక్సాఫీస్ పరంగా కొంచెం రిస్కే అవుతుంది. ఏపీ తెలంగాణలో సరిపడా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి కానీ కేవలం మూడు నాలుగు స్క్రీన్లు మాత్రమే ఆపరేషన్ లో ఉన్న కింది స్థాయి ఊళ్లు, బిసి సెంటర్లు చాలా ఉన్నాయి. వీటిలో అన్ని సినిమాలు రిలీజ్ చేయడం అసాధ్యం. పైగా ఆడియన్స్ కి ఆప్షన్లు ఎక్కువైపోతే ఓపెనింగ్స్ తో పాటు గ్రాసులు ప్రభావితం చెందుతాయి. మరి ఎవరికి వారు తగ్గమని భీష్మించుకు ఉంటారో లేదా ఒకరో ఇద్దరో వెనకడుగు వేస్తారో ఇంకొద్ది రోజుల్లో వేచి చూడాలి.
This post was last modified on October 27, 2025 10:59 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…