కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో నడుస్తున్న రీ రిలీజ్ ట్రెండులో ఒకప్పుడు ఒక పీక్స్ చూడబోతున్నాం. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ చిత్రాలతో తెలుగు సినిమా చరిత్రను మార్చిన రాజమౌళి అండ్ కో.. ఇప్పుడు మరో సంచలనానికి సిద్ధమైంది. ఇండియన్ సినిమాలో ఎన్నడూ లేని విధంగా రెండు భాగాలుగా విడుదలైన సినిమాను కలిపి ఒకటిగా విడుదల చేయబోతోంది. అదే.. బాహుబలి: ది ఎపిక్.
ఈ పని ఏదో మొక్కుబడిగా చేయకుండా ఒక కొత్త సినిమాకు పని చేసినట్లు కొన్ని వారాల పాటు రాజమౌళి బృందమంతా కలిసి ఎడిటింగ్ మీద కూర్చుంది. మూడు ముప్పావు గంటల నిడివితో ఈ చిత్రాన్ని ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు తేబోతోంది. ఆల్రెడీ యుఎస్ సహా పలు దేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. స్పందన చాలా బాగుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ ఆరంభించారు. రెస్పాన్స్ అదిరిపోతోంది.
ఒక కొత్త సినిమా తరహాలో ‘బాహుబలి: ది ఎపిక్’కు 31న ఉదయం 8 గంటల నుంచే షోలు పడబోతున్నాయి. వాటి టికెట్ల కోసం డిమాండ్ కూడా గట్టిగానే ఉంది. బుకింగ్స్ ఓపెనైన కాసేపటికే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోకి వచ్చేశాయి. కొన్ని షోలు ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయాయి కూడా. గంటకు 5 వేలకు ‘బాహుబలి: ది ఎపిక్’ టికెట్లు తెగుతున్నాయంటే ప్రేక్షకులు ఈ సినిమాపై ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థమవుతుంది.
నిన్ననే ‘బాహుబలి: ది ఎపిక్’ ట్రైలర్ లాంచ్ చేశారు. దాని క్వాలిటీ మామూలుగా లేదు. తెలిసిన కథ.. చూసిన సినిమానే అయినా.. మళ్లీ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచేలా కనిపిస్తోంది ‘బాహుబలి: ది ఎపిక్’. ఇండియాలో రీ రిలీజ్ రికార్డులన్నింటినీ ‘బాహుబలి’ బద్దలు కొట్టడం లాంఛనమే. ఫుల్ రన్లో ఈ చిత్రానికి వంద కోట్లకు తక్కువ కాకుండా వసూళ్లు రాబట్టి ఎవ్వరూ అందుకోని రికార్డును నెలకొల్పుతుందని అంచనా వేస్తున్నారు.
This post was last modified on October 25, 2025 1:56 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…